India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ భూక్య వెంకటేశ్వర్లుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్ఐ ఎన్.రాజారామ్ తెలిపారు. డిప్యూటీ వార్డెన్ వెంకటేశ్వర్లు లైంగికంగా వేధించాడని ఓ విద్యార్ధి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు.

ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 53 మంది బాల బాలికలను గుర్తించి విముక్తి కలిగించినట్లు తెలిపారు. బాలురు-44, బాలికలు 04 మొత్తం మంది 53 మంది ఉన్నారన్నారు. 16 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారన్నారు.

తొమ్మిది మంది ప్రొబేషనరీ సబ్- ఇన్స్‌పెక్టర్లకు (సివిల్) ఐదు నెలల శిక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్‌లను కేటాయిస్తూ.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ట్రైనీ ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. అప్పగించిన శాఖపరమైన భాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు.

ఖమ్మం జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ గ్రూప్-డి (32,000) పోస్టులకు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఉప సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు 7729961197 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. క్యాడర్‌కు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందుబాటులో ఉండడం లేదని టాక్. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా నేతలు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి.. ఎలాంటి హామీలు ఇవ్వాలో తెలియక లోకల్ లీడర్స్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

రైతుకష్టపడితేనే.. అందరికీ పంచభక్ష్యం.. అని రాసివున్న రాజకీయ ఫ్లెక్సీ రైతులు, వాహనాదారులను ఆకట్టుకుంటోంది. తల్లాడ మండలం అంజనాపురం సమీపంలో రైతు నలజాల శ్రీనివాసరావు తన మొక్కజొన్న పంటలో రాజకీయ నాయకుల ఫోటోలతో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో రైతు కష్టం చెబుతూనే తన అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.14,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోలిస్తే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్ లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు.

భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 309 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీశారు. ఇటీవల ఆసియా కప్ గెలవడంలోనూ ఈమె కీలక పాత్ర పోషించారు. దీంతో అందరి చూపు ఈ భద్రాచలం అమ్మాయిపైనే ఉంది. ఇలానే ఆడితే సినియర్ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పెనుబల్లి మండల కేంద్రంలో మహేందర్ సాయి అనే యువకుడు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. స్థానికుల వివరాలు… తనను ప్రేమించాలంటూ ఓ మైనర్ బాలిక ఇంటి ఎదుట హల్చల్ చేశాడు. కాసేపటి తరువాత స్థానికులను దూషించగా వారు దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కొంతకాలంగా మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు
∆} నేలకొండపల్లిలో భక్త రామదాసు జయంతి వేడుకలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
Sorry, no posts matched your criteria.