India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిద్రమాత్రలు మింగి జిల్లా టీఎన్జీవో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఖమ్మంలో జరిగింది. జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అబ్దుల్ హాసన్ తన ఇంట్లో భారీ మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సంతకాల ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్టైన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి విచ్చేసిన ప్రజల నుంచి డిప్యూటీ సీఎం దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలనుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
గోదావరిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన భద్రాచలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు ఈరోజు ఉదయం గోదావరిలో స్నానానికి వెళ్లాకం. ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
రైతు భరోసా స్కీమ్ను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. దీంతో కౌలు రైతులను గుర్తించడం సమస్యగా మారింది. ఈ క్రమంలో కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని ఫలాన రైతుకు కౌలుకు ఇచ్చినట్టు అఫడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ అంశంపై జోరు చర్చలు జరుగుతున్నాయి.
భార్య మరణించిన పదిహేను రోజులకే భర్త మృతి చెందిన సంఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం జగ్యాతండాలో శనివారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. తేజావత్ సంగ్యా(60), కౌసల్య దంపతులు. తీవ్ర అనారోగ్యానికి గురైన కౌసల్య చికిత్స పొందుతూ జూన్ 22న మృతి చెందింది. ఆమెను తలుచుకుంటూ నిత్యం మనోవేదనకు గురైన తేజావత్ సంగ్యా శనివారం మృతి చెందాడు.
భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యా వాచనం నిర్వహించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ , అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని జరిపారు.
సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని ఆమె మేనత్త రాజమ్మ కుప్ప కూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు ఒకే రోజున మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఖమ్మం జిల్లాలో 589, కొత్తగూడెం జిల్లాలో 481 జీపీలు ఉన్నాయి. ఐతే పారిశుద్ధ్యం నిర్వహణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు నేడు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారాయి. డబ్బులు లేక ట్రాక్టర్లు కార్యాలయంలోనే ఉంచుతున్నారు. బయటకు తీస్తే డిజీల్ కు డబ్బులు కావాలి. పెట్టుబడులు పెట్టే వారు లేరు. ఇప్పటికే అందినకాడికల్లా అప్పులు తెచ్చి పెట్టిన పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం చేతులేత్తేశారు.
కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవా పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.
తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బట్టీల గుంపు గ్రామ పంచాయతీలోని పాయం జానకిరామ్ గుంపునకు చెందిన కోరం కృష్ణవేణి (23) అనే యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. పొలంలో పనికి రాకపోవడంతో తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Sorry, no posts matched your criteria.