India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండల కేంద్రంలోని బంజారా కాలనీకి చెందిన పుచ్చకాయల గోపిరాజు ఈరోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి ఉందంటూ కుప్పకూలిపోయి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఖమ్మం జిల్లాలోని వెనుకబడిన ఆలయాల నిర్వహణకు రూపొందించిన ధూప దీప నైవేద్యాలు (డీడీఎన్) పథకం నిధులు విడుదలయ్యాయి. 2024 నవంబర్, డిసెంబర్ నెలల్లో పెండింగ్ బకాయిలను అర్చకుల ఖాతాల్లో దేవాదాయ శాఖ అధికారులు జమ చేశారు. ఖమ్మం జిల్లా లోని 330 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున వారి ఖాతాల్లో జమయ్యాయి.

ఖమ్మం జిల్లాలో క్షయ వ్యాధి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గతేడాది 2,314 మందికి వ్యాధి సోకినట్లు వైద్యశాఖ గుర్తించింది. గత నవంబర్ వరకు 25,847 మందికి పరీక్షలు చేయగా ఈ మేరకు కేసులు వెలుగుచూశాయి. ఎక్కువగా ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరాలో కేసులు నమోదయ్యాయి. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా ఆశించిన స్థాయిలో కేసులు తగ్గుముఖం పట్టడం లేదని జిల్లా టీబీ కంట్రోల్ అధికారులు అంటున్నారు.

ఖమ్మం- వరంగల్ – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవడంతో కోలాహలం మొదలైంది. కాగా ఇటీవలే ఈ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తైంది. ఖమ్మం జిల్లాలో 21 మండలాల పరిధిలో 24 పోలింగ్ బూత్ల పరిధిలో 3,955 మంది ఓటర్లుగా తేలారు. ఇందులో పురుషులు 2,300, మహిళలు 1,655 మంది ఉన్నారు. ఈ నెల 31 వరకు ఓటు నమోదుకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను బుధవారం నుంచి నిలిపివేయడంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు చెబుతున్నారు. సుమారు 5,000 క్వింటాల ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఉందని వారు అంటున్నారు. అధికారులు ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

మహాకుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సంతాపం తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న క్రమంలో సరైన ఏర్పాట్లు కల్పించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు ∆} సత్తుపల్లిలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ∆} వేంసూరులో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య- జానకమ్మను సీఎం రేవంత్ రెడ్డి, సినీనటుడు చిరంజీవి సన్మానించారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రత్యేక కార్యక్రమంలో వారిని వేదికపైకి ఆహ్వానించి సన్మానించిన సీఎం మాట్లాడారు. రైతు కుటుంబం నుంచి వచ్చి రామయ్య లక్షలాది మొక్కలు నాటి పర్యావరణానికి తోడ్పాటునందిస్తుండడంతో పద్మశ్రీ అవార్డు దక్కిందని తెలిపారు. అనంతరం ఆయనకు చెక్కు అందజేశారు.

KMM జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం పూర్తైన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో 6నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గుండెపోటుతో విద్యార్థిని మృతిచెందిన ఘటన రఘునాథపాలెం మండలం రేగులచలకలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఈ నెల 26న శ్రావణి స్కూల్‌లోనే అస్వస్థతకు గురైంది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం కన్నుమూసింది. శ్రావణి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
Sorry, no posts matched your criteria.