India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుండెపోటుతో విద్యార్థిని మృతిచెందిన ఘటన రఘునాథపాలెం మండలం రేగులచలకలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఈ నెల 26న శ్రావణి స్కూల్‌లోనే అస్వస్థతకు గురైంది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం కన్నుమూసింది. శ్రావణి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

గతేడాది U-19 ఆసియా కప్‌ను భారత్ గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించిన భద్రాచలం అమ్మాయి గొంగిడి త్రిష మహిళల అండర్ -19 ప్రపంచకప్‌లో దుమ్ము రేపుతోంది. మంగళవారం స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇలానే ఆడితే టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికవడం ఖాయమని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుంతలమయమైన రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. అందులో నియోజకవర్గాల వారీగా.. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.15.38 కోట్లు విడుదల చేశారు. అలాగే మధిర నియోజకవర్గంలో 10.90 కి.మీ.కు రూ.16.48కోట్లు, పాలేరు నియోజకవర్గంలో 29.04 కి.మీ.మేర రోడ్ల మరమ్మతుకు రూ.15.17కోట్లు, వైరా నియోజకవర్గంలో 29 కి.మీ.మేర మరమ్మతులకు రూ.13.67కోట్లు, సత్తుపల్లి నియోజకవర్గంలో 12పనులకు రూ.14.87 కోట్లు విడుదలయ్యాయి.

సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీలో ఖమ్మం జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి ఎర్ర శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, మాచర్ల భారతిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన సీపీఎం పార్టీ రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నారు. దీంతో వారికి పలు పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు.

ఖమ్మం: సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం భక్త రామదాసు కళా క్షేత్రాన్ని సందర్శించి కళాక్షేత్రంలో చేపట్టిన ఆధునికీకరణ పనులను పరిశీలించారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అయిన ఖమ్మం జిల్లాలో ఉన్న భక్త రామదాసు కళా క్షేత్రాన్ని ఆధునీకరించి ఆకర్షణీయంగా తయారు చేయాలని ఆదేశించారు.

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన కూసుమంచి మండలం నరసింహులగూడెం శివారులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. జుజ్జులరావుపేటకు చెందిన కూలీలు నర్సింహులగూడెం శివారులో మిర్చి తోటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మార్కెట్ అధికారులు రేపు (బుధవారం) సెలవు ప్రకటించారు. అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు. తిరిగి గురువారం మార్కెట్లో క్రయ విక్రయాలు జరుగుతాయని చెప్పారు. రైతులు గమనించాలని కోరారు.

ఖమ్మం జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలోని ఎంపిక చేసిన 21 రెవెన్యూ గ్రామాల్లో 20,802 మందికి రూ.28.42కోట్లను జమ చేసినట్లు అధికారులు తెలిపారు. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి 5,490 మంది రైతులకు చెందిన 6,419 ఎకరాల భూమిని రైతు భరోసా పోర్టల్ నుంచి రిమూవ్ చేసింది. మిగతా రైతులకు విడతలవారీగా పథకం అందనుంది.

ఖమ్మం: ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యత తో పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులున్నారు.

సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుదారుడి నుంచి రూ.2,500 లంచం తీసుకుంటూ 23వ వార్డ్ ఆఫీసర్ ఎన్.వినోద్ ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టణంలోని ఓ జ్యూస్ పాయింట్ వద్ద పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.