India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా నూతన రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

∆} జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పథకాలు ప్రారంభం
∆} జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 పథకాల అమలు కోసం ప్రభుత్వ ఆదేశాలనుసారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో 100% అర్హులైన వారికి పథకాలు అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదన్నారు.

సూర్యాపేట సీఈ(చీప్ ఇంజనీర్)గా విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబుకు ఖమ్మం జలవనరులశాఖ సీఈగా అదనపు బాధ్యలు ఇస్తూ శనివారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31న ఖమ్మం సీఈగా ఉన్న విద్యాసాగర్ పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఖమ్మం సీఈగా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో రమేష్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఖమ్మం: ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ఎక్కడైనా గొడవలు లేకుండా జరిగాయా అని ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. వందల మంది లబ్ధిదారులకు పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడమేంటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గ్రామ సభల్లో తిరగబడిన జనం రూపంలో కనిపించిందనిన్నారు.

మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అడిషనల్ డీసీపీ నరేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు పుట్టకోట రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్‌లో శుక్రవారం ఉడాన్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనారోగ్య సమస్యలు క్రీడలతో దరిచేరవని విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, సైదుబాబు, టెన్నిస్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు.

ములకలపల్లి మండలం చాపరాలపల్లి గుట్టగూడెం సమీపంలో పేకాట ఆడుతున్న కొంత మంది వ్యక్తులపై పోలీసులు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు రూ.6000 నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో SI కిన్నెర రాజశేఖర్‌తో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ‘బేటీ పడావో బేటీ బచావో’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బేటీ బచావోకు మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీపై సంతకం చేశారు. బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.

జూలూరుపాడు: అద్దె ఇంట్లో ఉన్న వారిని ప్రభుత్వం అనర్హులని తేల్చడం దారుణమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.