Khammam

News July 3, 2024

కొత్తగూడెం: చెట్టు కింద చదువు.. 54 మందికి ఒక్కరే టీచర్

image

తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటుతున్నా ఇంకా చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి వెంకటాపురం మండలంలో బోధపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. 54 మంది పైగా చదువుకుంటున్న ఈ పాఠశాలలో ఒక్కరే టీచర్ ఉన్నారని విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నామని.. నూతన భవనాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

News July 3, 2024

సీఎంకు తుమ్మల లేఖ

image

భద్రాచలం మండలంలోని ఆంధ్రాలో కలిపిన 5గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు, విభజన చట్టంలోని హామీలు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో 5గ్రామ పంచాయతీలను కలపాలని లేఖ ద్వారా తుమ్మల సీఎంను కోరారు.

News July 3, 2024

డీలక్స్ బస్సులో లక్కీ డ్రా బాక్స్ లు ఏర్పాటు: RM KMM

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజయన్ పరిధిలో భద్రాచలం-ఖమ్మం, ఖమ్మం-భద్రాచలం, సత్తుపల్లి-విజయవాడ, మణుగూరు-హైదరాబాద్, మధిర-హైదరాబాద్ రూట్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు కోసం లక్కీ డ్రా బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ప్రతీ నెల రెండుసార్లు లక్కీ డ్రా తీసి 24మంది మహిళా విజేతలకు బహుమతులు ఇస్తామన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.

News July 3, 2024

అశ్వారావుపేట ఎస్సైను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

image

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాసులు బుధవారం బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఎస్ఐ ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సైకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు.

News July 3, 2024

రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించం: డిప్యూటీ సీఎం భట్టి

image

ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని అయన స్పష్టం చేశారు. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని భట్టి వెల్లడించారు. ఐదేళ్లలో కనీసం రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు.

News July 3, 2024

సీఎం రేవంత్‌కు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వినతి 

image

రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన 5మండలాలను తిరిగి భద్రాచలం రెవిన్యూ పరిధిలో కలపాలని, కోరుతూ మాజీ ఎమ్మెల్యే వీరయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. భద్రాచలం  తప్ప పట్టణాన్ని ఆనుకొని ఉన్న రూరల్ ప్రాంతమంతా ఆంధ్రాలో కలవటం వల్ల  పుణ్యక్షేత్రంలో భూ సమస్య ఏర్పడిందని, కనీసం చెత్త వేసుకోవటానికి కూడా స్థలంలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

News July 3, 2024

సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు

image

దమ్మపేట మండలం ముష్టిబండకి చెందిన సత్యనారాయణ పొలానికి వెళ్లి అక్కడ గుండెపోటుతో కుప్పకూలాడు. సత్యనారాయణను గమనించిన తోటి రైతులు సమీపంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి సమాచారం అందించడంతో ఆయన సత్యనారాయణకు సీపీఆర్ చేశారు. దీంతో స్పృహలోకి వచ్చిన సత్యనారాయణను స్థానికులు, రైతులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News July 3, 2024

బోడకాకరకాయ ధరలకు రెక్కలు 

image

ఎక్కువ మంది అమితంగా ఇష్టపడే
బోడకాకర కాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మంలో మంగళవారం రూ.550కి కిలో చొప్పున బోడకాకర కాయలు విక్రయించారు. హోల్సేల్ మార్కెట్లో వ్యాపారులు కిలో రూ.450 చొప్పున కొనుగోలు చేసి రూ.100 అధికంగా రిటైల్ మార్కెట్లు, రైతు బజార్లు, వీధి వ్యాపారుల ప్రాంగణాల్లో విక్రయిస్తున్నారు. గతేడాది రూ. 200 నుంచి రూ. 250 వరకు ఉండగా, ప్రస్తుతం అది రెట్టింపైంది.

News July 3, 2024

పొలంలో పొంగులేటి.. BRS సెటైరికల్ ట్వీట్

image

పాలన, పార్టీ కార్యక్రమాలతో
నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి కల్లూరు మండలం నారాయణపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఫొటోలను తన ట్విటర్ అకౌంట్లో పంచుకున్నారు. పొంగులేటి ట్వీట్‌పై బీఆర్ఎస్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

News July 3, 2024

తలలో పెన్ను గుచ్చుకున్న బాలిక మృతి

image

<<13550256>>తలలో పెన్ను గుచ్చుకున్న<<>> నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. సోమవారం భద్రాచలం సుభాష్ నగర్‌లో ప్రమాదవశాత్తు పెన్నుగుచ్చుకుంది. ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసి వైద్యులు నిన్న పెన్ను తొలగించారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం బాలిక మృతి చెందింది.