India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 31న వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆధ్యయనోత్సవాలు నేటితో ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. 20 రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు అవతారాల్లో రామయ్య భక్తులకు దర్శనమిచ్చారు. జనవరి 26న విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవ కేవలం భద్రాద్రి రామయ్యకు మాత్రమే ప్రత్యేకం కావడం విశేషం.

మన ఖమ్మం ఖిల్లా కొత్త శోభ సంతరించుకోనుంది. పర్యటక రంగంగా పేరు ఉన్నప్పటికీ, సందర్శనకు ఆకట్టుకునే పరిస్థితి లేకపోవడంతో పాలకులు దృష్టి సారించారు. కొన్ని సంవత్సరాల తరువాత అభివృద్ధి పనులు సాగడంతో, ప్రాధాన్యత సంతరించుకుంటుందని భావిస్తున్నారు. ఖమ్మం ఖిల్లా పనులు పూర్తయితే, జిల్లా వాసులే కాక, ఇతర ప్రాంత పర్యటకులు ఇక్కడకి క్యూ కట్టడం ఖాయమని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

తెలంగాణలో ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ అమలవుతుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భట్టి మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12వేలు అందజేస్తామని స్పష్టం చేశారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు.

సత్తుపల్లి మండలం బుగ్గపాడులో<<15185005>> కృష్ణ, సీత దంపతులు <<>>చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణారావు లారీ, ఆటో, డీసీఎం కొనగా అవి ప్రమాదాలు, మరమ్మతులకు గురవడంతో అమ్మేశాడు. ఈక్రమంలో ఇల్లు గడవక, ఆదాయ మార్గం లేక ఇబ్బందిపడ్డాడు. తండ్రి పరిస్థితిని చూసి కుమార్తెలు సాయపడేవారు. వారిని ఇబ్బంది పెట్టలేక కృష్ణారావు దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకుని.. రావి చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్నారు.

ఖమ్మం ఖిల్లాకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి కోట నిర్మాణం ప్రారంభించగా.. క్రీ.శ. 1006లో నిర్మాణం పూర్తయింది. 1531లో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్‌ను ఓడించి కోటను స్వాధీనపరుచుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఖిల్లా కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్లింది. 17వ శతాబ్దంలో ఆసఫ్ జాహీల ఆధీనంలోకి పోయింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం నెలకొంది. బుగ్గపాడు గ్రామానికి చెందిన కృష్ణ(60), సీత(55) దంపతులు అదే గ్రామంలోని రావి చెరువులో శవమై తేలడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దంపతులు ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజాం హయాంలో ఖమ్మంలో నిర్మించిన మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వరదలకు బ్రిడ్జి ప్రమాదకరంగా మారడంతో రాకపోకలు నిలిపివేశారు. అటు రూ.187కోట్లతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పూర్తికి మరో ఏడాది పడుతుందంటున్నారు. దీంతో పక్కనే కాజ్‌వేపై రాకపోకలు పునరుద్ధరించడంతో ట్రాఫిక్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

పంచాయతీ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. HYD సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, మరో వెయ్యి మందిని నియమించేలా అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రూ.1,02,322 విరాళం ప్రకటించింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉదయ్ బ్యాంకు సిబ్బందితో కలిసి విరాళాన్ని ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమాదేవికి అందజేశారు. బ్యాంకు సిబ్బందిని ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా చేశారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.