India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు
పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను
తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు తలమానికమైన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం సరికాదన్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి నేతృత్వంలోనే సింగరేణి బొగ్గు గనులు వేలం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం రూరల్ పెద్ద తండాకు చెందిన బానోతు వీరన్న-జ్యోతి పెద్ద కుమారుడు బానోత్ అమిత్ రాథోడ్ ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించాడు. HYDలో ఇంటిగ్రేటెడ్ సివిల్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-పీజీ)ను ఇటీవల రాశాడు. ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 35వ ర్యాంకు సాధించి సీటు పొందాడు. అమిత్ రాథోడ్‌ను పలువురు అభినందించారు.
ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్ వివరాలను వ్యయ పరిశీలకులకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాద్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.
మధిర మండలం మర్లపాడులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో అనర్హులు కూడా పథకాలు అందజేశారని, తాము అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందజేస్తామని తెలిపారు.
ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్ (20) శనివారం అమెరికాలో మృతి చెందాడు. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలో మిస్సోరీ స్టేట్‌లో ఉన్న శ్యాండిల్ ఎస్ టౌన్‌లో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లిన కిరణ్ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో మునిగి చనిపోయాడు.
తెలంగాణలో హరితహారం గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు తొమ్మిది విడతలుగా మొక్కలు నాటించింది. ప్రస్తుత ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట ఈకార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఐతే పచ్చదనం పెంపుదలకు 1950లో కాంగ్రెస్ సర్కారు ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తికానున్న నేపథ్యంలో ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా నామకరణం చేశారు.
రేపటి నుండి అమలయ్యే కొత్త చట్టాలపై జిల్లాలోని పోలీసులతో పాటు న్యాయవాదులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగులకు ఇటీవల కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని 25 పోలీస్ స్టేషన్లతోపాటు ట్రాఫిక్, మహిళ, సీసీఎస్, సైబర్ క్రైమ్, టాస్క్ ఫోర్స్, సీసీఆర్పీ, ఐటీ కోర్ టీమ్లకు సంబంధించి 888 మంది సిబ్బందికి విడతల వారీగా, బ్యాచ్‌కు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
వసతిగృహ సంక్షేమాధికారుల ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పరీక్ష ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో శనివారం రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఖమ్మంలో ఉన్న ప్రియదర్శిని యంత్రవిద్య మహిళా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 80 మంది అభ్యర్థులకు సాయంత్రం 5గంటలకు ప్రారంభమైంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యమైనట్లు నోడల్ అధికారి శ్రీరాం తెలిపారు.
హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు రూ.655 కోట్లతో ఈ ఏడాది 6 రోడ్లు మంజూరు చేశామన్నారు. ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. గతంలో R&B మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారుల గురించి ప్రతిపాదన చేశానన్నారు. కొత్తగూడెం పాల్వంచ బైపాస్, మిస్సింగ్ లింక్ కలపడానికి 6km రోడ్డు రూ.125 కోట్లకు ఆమోదముద్ర పడిందన్నారు.
Sorry, no posts matched your criteria.