Khammam

News January 13, 2025

కూసుమంచిలో 30 రోజుల్లోనే ఇందిరమ్మ మోడల్ ఇల్లు పూర్తి

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ మండలంలో ఒక నమూనా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 13న మంత్రి పొంగులేటి కూసుమంచి ఎమ్మార్వో ఆఫీసు దగ్గర ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నెల రోజుల్లోనే పూర్తి చేశారు. రాష్ట్రంలోనే తొలి నమునా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి వచ్చింది. రూ.5లక్షలతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్ జీవన్ రెడ్డి తెలిపారు.

News January 13, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఐదుగురు మంత్రులు పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు

News January 13, 2025

KMM: రూ.22వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు: డి.సీఎం భట్టి

image

ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. కానీ గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు.

News January 12, 2025

ఖమ్మంలో 2 రోజులు పర్యటించనున్న Dy.CM భట్టి

image

ఖమ్మం జిల్లాలో రెండు రోజులు పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు భట్టి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘సోమవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం 2 గంటలకు రఘునాథపాలెం మండలం మంచుకొండలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తారు. మంగళవారం మధిరలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న’ట్లు వివరించారు.

News January 12, 2025

కొనిజర్ల: లారీని, బస్సును ఢీ కొట్టిన మరో లారీ

image

ఖమ్మం జిల్లా కొనిజర్ల సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని, ట్రావెల్ బస్సును మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయి. ట్రావెల్ బస్సు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో 56 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 12, 2025

ఖమ్మం: లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడు బలి

image

లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలైన ఘటన నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో శనివారం చోటుచేసుకుంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం వెంకటాయ తండాకు చెందిన శ్రీనివాస్ డిప్లొమా చదువుతున్నాడు. నగరానికి పని నిమిత్తం బైక్‌పై వస్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శ్రీనివాస్ బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈఘటనలో శ్రీనివాస్ లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

News January 12, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News January 12, 2025

KMM: సంక్రాంతి సంబురాలు.. విషాదం కావొద్దు: CP

image

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో, తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. బావులు, చెరువుల్లో ఈత కొట్టేందుకు వెళ్తారని, వారితో పాటు తోడుగా వెళ్లాలని నిరంతరం గమనించాలని సూచించారు. అలాగే యువతకు వాహనాలు ఇవ్వవొద్దని, ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.

News January 12, 2025

జనవరి 26న 4 పథకాలు అమలు: ఖమ్మం కలెక్టర్

image

జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి నాలుగు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమిలేని కుటుంబాలకు ఆత్మీయ భరోసా వర్తించనుందన్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, పథకాల పర్యవేక్షణకు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

News January 11, 2025

ఇల్లెందులో క్షుద్ర పూజలు కలకలం

image

ఇల్లెందు పట్టణంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇల్లందులోని ఓ ఇంట్లో శివశక్తి దండుసారయ్య ఫొటోలు పెట్టి హతమార్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న దండుసారయ్య, అనుచరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.