India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ధర్మపురి శ్రీనివాస్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా డీఎస్ సేవలను డిప్యూటీ సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ పాషా కొట్లాటకు దిగారు. పరస్పరం ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో ఛైర్మన్ వర్సెస్ వైస్ ఛైర్మన్ వర్గాలుగా కౌన్సిలర్లు విడిపోయారు. కాగా ఈ ఘటన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే జరిగింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎమ్మెల్యే సముదాయించడంతో ఇరువురు శాంతించారు.
నేలకొండపల్లి మండల పరిధిలోని భైరవునిపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో విద్యుత్ మోటర్‌ను ట్రాక్టర్‌తో కట్టి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడింది. ట్రాక్టర్‌తో పాటు భార్యభర్తలు మాధవి, బాబు ఒక్కసారిగా బావిలో పడ్డారు. భర్త బాబు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకొని వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో భర్త క్షేమంగా బయటపడగా భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తృతపరచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఓ రైతు వేదికలో మాత్రమే అవగాహన కార్యక్రమాలు జరిగేవి. ఐతే ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో 16, భద్రాద్రి జిల్లాలో 13 కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు క్లస్టర్ల వారీగా రైతు వేదికలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని తెలిపారు.
మధిర: ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి. శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురంధరుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని భట్టి పేర్కొన్నారు.
అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను కలెక్టర్ జితేశ్ శుక్రవారం సందర్శించారు. ఆయనకు జలవనరులశాఖ అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. పూసుగూడెం, కమలాపురం వద్దనున్న పంప్‌హౌస్‌లు ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని 104 కిలోమీటర్ల సీతారామ ప్రధాన కాల్వ ద్వారా జలాలను వదిలేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఖమ్మం పుట్టకోట క్రాస్ సమీపంలో గురువారం రోడ్డుప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థి కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. ముదిగొండ మండల కట్టకూరుకు చెందిన ప్రవీణ్ తనికెళ్ల విజయ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కాలేజీకి వెళ్లి ఫీజు చెల్లించి బైక్‌పై తిరిగి వస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టిందని తెలిపారు.
సీతారామప్రాజెక్టు ట్రయల్‌రన్ విజయవంతంతో మాజీ సీఎం కేసీఆర్ ఉక్కుసంకల్పం నెరవేరినట్లయిందని MLC తాతామధు తెలిపారు. ఖమ్మంలోని శుక్రువారం ఆయన మాట్లాడారు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయబోతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టు ఇన్నాళ్లు కుంభకోణమని నిందించిన వారు, ఇప్పుడెలా ట్రయల్‌రన్‌ను ప్రారంభించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రయాణికుల తమ రిజర్వేషన్ టికెట్లను 8 రోజుల ముందస్తుగా చేసుకున్నట్లయితే రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరీరామ్ అన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి నాన్ ఏసి స్లీపర్, లహరి ఏసి స్లీపర్, బస్సులలో వర్తిస్తుందని అన్నారు.
Sorry, no posts matched your criteria.