Khammam

News March 19, 2024

KMM:రైలు కింద పడి యువకుడి బలవన్మరణం

image

చింతకాని మండలం అనంతసాగర్ సమీపంలో మల్లెల కుటుంబరావు (30) అనే వ్యక్తి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంకు చెందిన కుటుంబరావు కొంతకాలంగా అత్తగారి ఊరైన అనంతసాగర్లో నివసిస్తున్నాడు. సోమవారం ఓ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై పారుపల్లి భాస్కర్ రావు తెలిపారు.

News March 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓రెండవ రోజు కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు
✓తల్లాడ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి మండలం లో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం జిల్లాలో ఓటు నమోదు పై ప్రత్యేక కార్యక్రమం
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

News March 19, 2024

KTDM: ప్రిన్సిపల్‌ వేధింపులు.. విద్యార్థినుల ఆందోళన..!

image

ప్రిన్సిపల్‌, సహాయకులు విద్యార్థినుల హాస్టల్లోకి వచ్చి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారంటూ భద్రాద్రి జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. ప్రిన్సిపల్‌ విద్యార్థినులుండే హాస్టల్‌కు రాత్రివేళ సిబ్బందితో వచ్చి క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరితో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్‌ వివరణిస్తూ.. ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు.

News March 19, 2024

పొంగులేటి ప్రధాన అనుచరుడికి చుక్కెదురు..!

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడికి చుక్కెదురైంది. ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ పోస్టుల్లో వైరాకు చెందిన బొర్రా రాజశేఖర్‌కు అవకాశం లభించలేదు. శ్రీనివాసరెడ్డి 2013లో వైసీపీలో చేరినప్పటి నుంచి అతని అనుచరుడుగా కొనసాగుతున్నారు. కార్పొరేషన్ పోస్టుల్లో అవకాశం లభిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయనకు కార్పొరేషన్ పదవి లభించపోవడం వైరా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశనే మిగిల్చింది.

News March 19, 2024

ఖమ్మం: మహిళా ఓటర్లే అధికం

image

ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం. 2019లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. ఈసారి వీరి సంఖ్య 8,39,640కి పెరిగింది. పురుష ఓటర్లు 7,39,600 మంది నుంచి 7,84,043 మందికి చేరుకున్నారు. మహబూబాబాద్‌ స్థానంలో 2019లో 7,21,383 మంది మహిళా ఓటర్లు ఉండగా ఈసారి వీరి సంఖ్య 7,81,339కి పెరిగింది. పురుష ఓటర్లు 7,01,921 మంది నుంచి 7,45,564 మందికి చేరారు.

News March 19, 2024

ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలి:కలెక్టర్

image

ఖమ్మం : అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని అన్ని శాఖల కార్యాలయాల సందర్శన చేసి, రాజకీయ నేతల, రాజకీయ పార్టీలకు సంబంధించి క్యాలెండర్లు, పోస్టర్లు ఫోటోలు తొలగించింది పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ యువరాజు పాల్గొన్నారు.

News March 18, 2024

ఎన్నికల నిర్వహణలో నిఘా బృందాల పాత్ర కీలకం

image

ఖమ్మం: స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణలో నిఘా బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం సమావేశ మందిరంలో ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఎంసిసి బృందాలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల్లో నిఘా బృందాలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జిల్లాలో 15 ఎస్ఎస్టీ, 12 ఎఫ్ఎస్టీ, 27 ఎంసిసి బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News March 18, 2024

తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుంటూ పరీక్ష రాసిన విద్యార్థి

image

తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుంటూ ఓ కుమారుడు పదవ తరగతి పరీక్ష రాసిన ఘటన కల్లూరులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాంపురం గ్రామానికి చెందిన  మారబోయిన అఖిల్ పదో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం పదవ తరగతి పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు మనోధైర్యం నింపి పరీక్షకు పంపించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

News March 18, 2024

నిరాధార, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

నిరాధార, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ అభ్యర్థులకు HYD స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్ లో 2 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పేరా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వార్తలో నిజం లేదన్నారు. నిరాధార, తప్పుడువార్తలు ట్రోల్ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.

News March 18, 2024

డీసీఎం- బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

image

కల్లూరు మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ డీఈ కార్యాలయం ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను బైక్‌‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.