Khammam

News June 25, 2024

ఖమ్మం: భార్యని తిట్టాడని వ్యక్తి సూసైడ్

image

ఇంటి యజమాని అవమానించాడనే మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన గోళ్ల జనార్దన్ రావు ఇంట్లో చింతకాయల నాగరాజు (48) తన కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం జనార్దన్ రావు, నాగరాజు భార్య విషయంలో అసభ్యంగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 25, 2024

ఖమ్మం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఖమ్మం-మల్లెమడుగు రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.భాస్కరరావు తెలిపిన వివరాలు.. రాపర్తినగర్ వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా అతణ్ని రైలు ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలోని మృతి చెందినట్లు తెలిపారు. అన్నం ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని శవాగారంలో భద్రపరిచామన్నారు.

News June 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఇల్లందులో సింగరేణి అద్దె వాహనాల వేలం
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె

News June 25, 2024

ఖమ్మం: గృహ జ్యోతి దరఖాస్తులకు అవకాశం

image

గృహ జ్యోతి పథకం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎన్పీడీసీఎల్ ఖమ్మం ఎస్‌ఈ ఏ.సురేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం గతంలో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ ప్రాంత వాసులు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News June 25, 2024

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీలు..!

image

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీలు పేర్కొన్నారు.

News June 24, 2024

భద్రాద్రి: మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సారపాక గాంధీనగర్‌లో మూడేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్: మంత్రి

image

సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

News June 24, 2024

ఖమ్మం: ఇంటర్ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో ఖమ్మం జిల్లాలో 653మంది హాజరవగా319 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 48.85గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 494మంది పరీక్ష రాయగా 230మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46.56గా ఉంది.

News June 24, 2024

ఖమ్మం: ఇంటర్ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో ఖమ్మం జిల్లాలో 653మంది హాజరవగా319 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 48.85గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 494మంది పరీక్ష రాయగా 230మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46.56గా ఉంది.

News June 24, 2024

ఖమ్మం : ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలిలా..

image

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో ఖమ్మం జిల్లాలో 9,950 మంది హాజరవగా 6,679 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 67.13గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 4,716 మంది పరీక్ష రాయగా 3,027 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 59.41గా ఉంది.