Khammam

News January 1, 2025

KMM: న్యూ ఇయర్ రోజే యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

కూసుమంచి మండలం చేగొమ్మ శివారులో న్యూ ఇయర్ రోజే రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న షేక్ పాషా(35) అక్కడికక్కడే మృతి చెందాడు. చేగొమ్మలో స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు పెరికసింగారం గ్రామ వాసి అని స్థానికులు తెలిపారు.

News January 1, 2025

కూర్మావతారంలో దర్శనం ఇవ్వనున్న రామయ్య

image

భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా మొదలైన విషయం తెలిసిందే. ఈరోజు రామయ్య కూర్మావతారంలో దర్శనమిస్తాడు. ఈ అవతారంలో పూజిస్తే శని గ్రహ దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26న విశ్వరూప సేవ ఉంటుంది. దేవతలందరినీ ఒకేచోట కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సేవ కేవలం భద్రాద్రి రామయ్యకు మాత్రమే ప్రత్యేకం కావడం విశేషం.

News January 1, 2025

జిల్లా ప్రజలకు మంత్రి పొంగులేటి నూతన సంవత్సర శుభాకాంక్షలు

image

ఖమ్మం జిల్లా ప్రజలకు రెవెన్యూ, గృహ, నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఏడాది, ఆశలు, కోరికలు, లక్ష్యాలు, ఆశయాలు, నిర్ణయాలు, ఉత్సాహంతో కలకాలం ఉండాలని కోరారు. ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులతో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ఇంటింటా ఆనందాలు కలగాలని చెప్పారు.

News December 31, 2024

ఖమ్మం: మైనార్టీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా జిల్లాలో గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కల్పించనుంది. పైన పేర్కొన్న పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి నాలుగు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనార్టీ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు కార్యాలయంలో తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

News December 31, 2024

ఎటపాక: బాలుడిని నరికి చంపిన వ్యక్తి

image

ఎటపాక మండలం మద్ది గూడెంకు కనితి నాగరాజ్ అనే బాలుడిని అదే గ్రామానికి చెందిన ముర్రు కోటేశ్వరరావు సోమవారం గొడ్డలితో నరికి చంపాడు. మద్ది గూడెం అటవీ ప్రాంతం కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోటేశ్వరరావు మానసిక రోగిలా మారి తిరుగుతున్నాడని గ్రామస్థులు చెప్పారు. పొలానికి వెళ్లిన కనితి నాగరాజ్‌ను గొడ్డలితో నరికి పారిపోయాడన్నారు. ఎటపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 31, 2024

మత్స్యావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు మంగళవారం దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి మంత్రోచ్చారణలతో క్రతువును కమనీయంగా కొనసాగించారు. స్వామివారు మత్స్యావతారంలో దర్శనమివ్వడంతో భక్తులు మురిసిపోయారు. తిరువీధిసేవ ఆధ్యాత్మికతను చాటగా సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బుధవారం కూర్మావతారం దర్శనం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

News December 31, 2024

ముక్కోటి ఏకాదశిలో.. రామయ్య దశావతారాలు

image

భద్రాచలం ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నేటి నుంచి 2025 JAN 20 వరకు అంగరంగావైభవంగా జరుగనున్నాయి. అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రామయ్య తన దశావతారాలలో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తారు. DEC 31న మత్స్యావతారం, JAN 1న కూర్మావతారం, 2న వరాహావతారం, 3న నరసింహావతారం, 4న వామనావతారం, 5న పరశురామావతారం, 6న శ్రీరామావతారం,7న బలరామావతారం, 8న శ్రీకృష్ణావతారం, 9న తెప్పోత్సవం,10న ఉత్తర ద్వార దర్శనమిస్తారు.

News December 31, 2024

ఖమ్మం: వరద బాధితులకు పదో తరగతి సర్టిఫికెట్లు విడుదల

image

ఖమ్మం మున్నేరువాగు ప్రాంతాల్లో వరదల్లో పదో తరగతి సర్టిఫికెట్లు కోల్పోయి.. జిల్లా విద్యా మరియు జిల్లా విద్యాధికారి కార్యాలయం ఖమ్మం నందు వివరాలు నమోదు చేసుకున్న వారి డూప్లికేట్ పదో తరగతి సర్టిఫికెట్స్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వచ్చాయని వారు ప్రకటనలో తెలిపారు. కావున సంబంధిత అభ్యర్థులు ఆధార్ కార్డ్, ఒక జిరాక్స్ కాపీతో స్వయంగా జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News December 31, 2024

తిరుమలాయపాలెం: 100 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

image

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం అజ్మీరాతండా శివారు బోర్సుగడ్డ తండాలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అనంతరం సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. బోర్సుగడ్డ తండాకు చెందిన సురేష్, నరేష్, పిండిప్రోలుకు చెందిన శంకర్, రామకృష్ణలపై కేసు నమోదు చేశారు.

News December 31, 2024

ఖమ్మం ప్రజలు కుటుంబ సభ్యుడిలా ఆదరించారు: మంత్రి తుమ్మల

image

ఖమ్మం నియోజకవర్గ ప్రజలు తనను కుటుంబ సభ్యుడిగా ఆదరించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వంలో ఉన్నా జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టుకు స్థలం ఎంపిక జరుగుతోందని తెలిపారు. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు అందించడమే తన లక్ష్యమన్నారు. వరద ముంపు నివారణకు రూ.700 కోట్లతో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.