Khammam

News December 31, 2024

న్యూ ఇయర్‌లో న్యూసెన్స్ చేస్తే కేసులు: సీపీ సునీల్ దత్

image

నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసిందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ప్రధాన రహదారులు, సినిమా థియేటర్లు, లకారం ట్యాంక్‌బండ్‌, వెలుగుమట్ల పార్కు, తదితర పబ్లిక్‌ పార్కుల్లో పోలీసు పెట్రోలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. DEC 31 అర్ధరాత్రి ఒంటిగంటకు ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తే, వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేస్తామని హెచ్చరించారు.

News December 31, 2024

భద్రాద్రి: ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి: ఎస్పీ

image

సంతోషాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ప్రజలకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ పోలీస్ శాఖ తరుపున భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్‌ 31న జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనిఖీ చేపడతామని చెప్పారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 30, 2024

ICAR శాస్త్రవేత్తగా ఖమ్మం జిల్లా వాసి

image

తిరుమలాయపాలెం మండల పరిధి సుబ్లేడుకు చెందిన లత ఇటీవల జరిగిన నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ (ICAR)పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగంలో భారత వ్యవసాయ మండలి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. పరిశోధనలు చేసి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమని లత అన్నారు.

News December 30, 2024

జాతరను తలపించేలా భద్రాద్రిలో ముక్కోటి ఉత్సవాలు

image

భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమై 2025 జనవరి 20 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నందున భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భద్రాద్రి రామయ్య దశావతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలు జాతరను తలపించేలా ఉండనున్నాయి.

News December 30, 2024

రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి: మంత్రి తుమ్మల

image

గతంలో వివిధ డీసీసీబీలలో కొన్ని తప్పులు జరిగాయని, పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను హెచ్చరించారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టీజీసీఏబీ) పని తీరు, ఆర్థిక అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. రుణ మాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు త్వరితగతిన కొత్త రుణాలు ఇవ్వాలని సూచించారు.

News December 30, 2024

ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద గిరిజన సంస్కృతి సాంప్రదాయాల కళారూపాలను ప్రదర్శించాలన్నారు. వినోద కార్యక్రమ సభ ప్రాంగణాన్ని వంటకాలను ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

News December 30, 2024

గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు ఖమ్మం జిల్లా

image

గ్రానైట్ పరిశ్రమకు ఖమ్మం జిల్లా పెట్టింది పేరని, దీని అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఆదివారం ఖమ్మంలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ జిల్లా నుంచే ఢిల్లీలో ఉన్న పోలీస్ జాతీయ స్మారక మ్యూజియానికి, ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గ్రానైట్‌ను అందజేయడం జరిగిందన్నారు.

News December 29, 2024

KMM: పత్తి చేనులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో ఈరోజు తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా… మధిర మండలం దెందుకూరు గ్రామ సమీపంలో పత్తి చేనులో వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చారు. అవి తగిలి చర్చి ఫాదర్ మీసాల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 29, 2024

ఖమ్మం: సైబర్ నేరస్థుల వలలో చిక్కకండి: సీపీ సునీల్ దత్

image

ఖమ్మం ప్రజలకు సీపీ సునీల్ దత్ పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్ల మోసాలు అధికంగా పెరిగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే పంపి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు పంపాలని ఫోన్ చేస్తే వెంటనే 1930ను సంప్రదించాలని సీపీ కోరారు. 

News December 28, 2024

KMM: ఉత్సాహంగా ప్రారంభమైన సీపీఐ శతాబ్ది ఉత్సవాలు

image

సీపీఐ శత వసంతాల ఉత్సవాలు శుక్రవారం మణుగూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా రామానుజవరంలో అమరుల స్థూపాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ నుంచి ఆదర్శ్ నగర్ వరకు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.దీంతో ఎర్రజెండాలతో మణుగూరు వీధులు ఎరుపెక్కాయి. మహిళలంతా ఎర్రజెండాలను చేతపట్టి నడిచారు. సభా వేదికపై కళాకారులు నృత్య ప్రదర్శన చేసి అలరించారు.