Khammam

News June 22, 2024

పాల్వంచ: కేటీపీఎస్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

image

కేటీపీఎస్ స్క్రాప్ టెండర్ల అవినీతి అక్రమాల నిగ్గు తేల్చే వరకు విశ్రమించనని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఇటీవల కాలంలో కేటీపీఎస్ O&M స్క్రాప్ టెండర్, తరలింపు విషయాల్లో వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం O&M DD ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం సిఈ చాంబర్‌లో అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టెండర్ ప్రక్రియ, విచారణ కమిటీకి అందించిన నివేదికల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News June 21, 2024

ఖమ్మం: ‘ఇక్కడి కందిపప్పుకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం’

image

పెరుగుతున్న అవసరాల దృష్టిలో ఉంచుకుని దేశంలో పప్పు దినుసుల సాగును పెంచాల్సి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో మంత్రి తుమ్మల హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పండించే తాండూరు కంది పప్పుకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం ఉందని, ప్రతి సంవత్సరం 4 లక్షల క్వింటాళ్ళ కందిపప్పు అక్కడ నుంచి మార్కెట్‌కు వస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.

News June 21, 2024

బోనకల్: అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

బోనకల్- ఖమ్మం రహదారిలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకు వెళ్లిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలకు దూసుకు వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

image

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో శుక్రవారం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో తరలిస్తున్న 150 కిలోల నిషేధిత గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన కారును 150 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 21, 2024

అల్బెండజోల్‌తో రక్తహీనతకు చెక్: DMHO మాలతి

image

పిల్లలను రక్తహీనత నుండీ కాపాడేందుకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి వెల్లడించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్ కార్యాలయంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఆమె, డీఈఓ సోమశేఖర శర్మతో కలిసి విద్యార్థులకు మాత్రలు మింగించే కార్యక్రమం ప్రారంభించారు.

News June 21, 2024

కొత్తగూడెంలో నకిలీ నోట్ల చలామణి ముఠా అరెస్ట్

image

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠాను సుజాతనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ప్రకారం.. తూ.గో. జిల్లాకు చెందిన సింగంశెట్టి సత్య ఫణికుమార్, రాజమండ్రికి చెందిన వంశీకృష్ణతో సుజాతనగర్ చెందిన సురేశ్, రాకేశ్  నాయకులగూడెం వద్ద నకిలీ నోట్లు చలామణి చేసేందుకు వచ్చిన నలుగురు సభ్యుల ముఠాను పట్టుకోగా ఒకరు పరారైనట్లు తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు.

News June 21, 2024

ఖమ్మం జిల్లాలో ధరణి దరఖాస్తులు 10 శాతం పెండింగ్

image

ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 90 శాతం ధరణి దరఖాస్తులను అధికారులు క్లియర్ చేశారు. మరో 10 శాతం పెండింగ్ ఉన్నా.. వాటిలో తహశీల్దార్ల స్థాయిలోనే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 78,710 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 57,101. (73 శాతం) దరఖాస్తులను పరిష్కరించగా, 13,269 (27 శాతం) అప్లికేషన్లను రిజక్ట్ చేశారు. మరో 8,340 దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News June 21, 2024

నల్గొండ జిల్లాలో పాల్వంచ యువతి సూసైడ్

image

ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన దొడ్డా సురేశ్ యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ పాల్వంచకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> బోనకల్లో సిపిఎం మండల రాజకీయ శిక్షణ తరగతులు
> తల్లాడలో కౌలు రైతు సంఘం మండల కమిటీ సమావేశం
> అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> సత్తుపల్లిలో ఏరువాక కార్యక్రమం
> ఎమ్మెల్యే మట్ట రాగమయి పర్యటన
> ఖమ్మం జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్
> మధిరలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
> నీట్ పరీక్షను రద్దు చేయాలని కొత్తగూడెంలో ఎస్ఎఫ్ఐ నిరసన

News June 21, 2024

హైవేపై ఎగ్జిట్స్.. ఫలించిన తుమ్మల ప్రయత్నాలు

image

గ్రీన్ ఫీల్డ్ హైవేలో వేంసూరు, లింగాల వద్ద ఎగ్జిట్ రోడ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు తుమ్మల ఇచ్చిన హామీ నెరవేర్చినట్లైంది. ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక మేరకు మంత్రి తుమ్మల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ ఎగ్జిట్స్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.