India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆశ వర్కర్లు చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మంకు చేరుకున్న నేపథ్యంలో వారికి తమ్మినేని సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది. ఈ పోటీలు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలు పూర్తిచేసుకుని, డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. కాగా ఖమ్మం జిల్లా నుంచి 24 క్రీడాంశాల్లో 422 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొంది, పోటీల్లో పాల్గొననున్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్‌తో భరోసా కల్పిస్తోంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 2.01 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. అటు రైతుల ఖాతాల్లో రూ.368 కోట్లు జమ చేయగా ప్రతీ క్వింటాకు ధరతో సంబంధం లేకుండా రూ.75.32 కోట్లు బోనస్‌గా చెల్లించిందన్నారు. జనవరి చివరి వరకు ధాన్యం సేకరణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.

జీపీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1,070 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 589, కొత్తగూడెం జిల్లాలో 481 జీపీలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఎక్కువగా ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని అనుకుంటున్నారు. కామెంట్ చేయండి.

భద్రాద్రి రామాలయంలో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఈ నెల 30న లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 26న హుండీ లెక్కింపు నిర్వహిస్తామని ప్రకటన చేసిన తరువాత ఈ నెల 30కు లెక్కింపు కార్యక్రమాన్ని మార్చడం జరిగిందన్నారు. ఉ.8 గంటలకు దేవస్థానంలోని చిత్రకూట మండపంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పిఏ రాఘవ రావు ఓ ప్రకటనను విడుదల చేశారు. దమ్మపేట, అశ్వరావుపేట, ములకలపల్లి, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయా జిల్లాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?

ICC అండర్-19 మహిళల ప్రపంచ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో భద్రాచలంకు చెందిన త్రిషకు <<14974104>>చోటు లభించిన<<>> సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఓ కంపెనీలో ఫిట్ నెస్ ట్రైనర్‌గా పనిచేసేవారు. త్రిష ప్రతిభను గుర్తించి తన జాబ్‌ను విడిచిపెట్టి మరీ ప్రోత్సహించారు. ఆమె కోసం సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యారు. HYD సౌత్ జోన్, సీనియర్ టీం, 2023 ICC అండర్-19 T20 ప్రపంచ కప్, ఆసియాకప్ ఆడిన త్రిష మళ్లీ ICC-19 ప్రపంచ కప్‌కు సెలక్టయ్యారు.
Sorry, no posts matched your criteria.