Khammam

News June 20, 2024

జిల్లాలో 875 మంది పదోన్నతులు.. విధుల్లో చేరిక

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావటంతో వారు ఆయా స్థానాల్లో విధుల్లో చేరారు. జిల్లాలోని పండిట్, పీఈటీ, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. జిల్లాలో 954 మందికి పదోన్నతులు రాగా.. 875 మంది బుధవారమే విధుల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా వారు నేడు విధుల్లో చేరే అవకాశం ఉంది.

News June 20, 2024

ఖమ్మం: ఈనెల 22న జేఎల్ఎంలకు పోల్ క్లైంబింగ్ టెస్ట్ 

image

ఖమ్మంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఈనెల 22న ఉమ్మడి జిల్లాలోని జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన, పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.సురేందర్ తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

News June 20, 2024

బడిబాట ద్వారా సత్ఫలితాలు 

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్
జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలను గుర్తించి 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకొక కార్యక్రమం నిర్వహించారు. మొత్తంగా బుధవారం నాటికి 10,065 మంది విద్యార్థులు సర్కారు స్కూళ్లలో ప్రవేశాలు పొందారు.

News June 20, 2024

భద్రాచలం: రామాలయ ప్రవరపై విచారణ పూర్తి

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రవర నిర్వహణ తీరుపై ప్రత్యేక కమిటీ చేపట్టిన విచారణ పూర్తైంది. మంగళవారం ఇక్కడికి వచ్చిన ఐదుగురు సభ్యులు రెండు రోజులపాటు సమగ్ర వివరాలను సేకరించారు. కళ్యాణం చేసే విధానంలో తప్పులు ఉన్నాయని కొందరు భక్తులు కోర్టును ఆశ్రయించడంతో ఇందులో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం వారు కళ్యాణ క్రతువును చిత్రీకరించారు.

News June 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్య అంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మంలో రెండో రోజు కొనసాగుతున్న జర్నలిస్టుల మహాసభ ∆} దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News June 20, 2024

KMM: ఒక్కసారిగా కుప్పకూలిన మిర్చి ధరలు

image

ఖమ్మం జిల్లాలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. ఈ ఏడాది ధరలు తగ్గడంతో క్వింటాల్ కనీస ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర 20,700కి పడిపోయింది. తేజ రకానికి చెందిన మిర్చి మాత్రమే క్వింటాల్ రూ.19,500 ధర పలుకుతోంది. మిగిలిన అన్నిరకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి. ఎగుమతులు ప్రారంభంకాకపోవడంతో కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి నిల్వలు పేరుకుపోతున్నాయి.

News June 20, 2024

నిత్యవసర వస్తువుల సరఫరాకు టెండర్ల స్వీకరణ: కలెక్టర్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 27 గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య మోడల్ విద్యాలయాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయుటకు ఆసక్తిగల వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈనెల 21 నుండి 25 వరకు టెండర్ పారంలను ఉ. 10:30 గంటల నుంచి సా.ఐదు గంటల వరకు కార్యాలయం పని దినాలలో టెండర్ షెడ్యూల్ ఐటీడీఏలోని ప్రాంతీయ సమన్వయ అధికారి గురుకులం కార్యాలయం నందు పొందాలన్నారు.

News June 19, 2024

మణుగూరు నుంచి దక్షిణ కొరియాకు భారజలం ఎగుమతి

image

దక్షిణ కొరియాకు 20 వేల లీటర్ల భారజలాన్ని భద్రాద్రి జిల్లాలోని మణుగూరు భారజల ప్లాంటు నుంచి ఎగుమతి చేశారు. గౌతమీనగర్ లోని పర్ణశాల అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారజలం ఉన్న కంటైనర్ వాహనాన్ని భారజల బోర్డు ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.సత్య కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సీఐఎస్‌ఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈ వాహనం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది.

News June 19, 2024

ఖమ్మం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ప్రకాశ్ నగర్‌కు చెందిన మాదాసు రవి ఖానాపురంలో ఓ ఇంట్లో పనికి వెళ్ళాడు. అక్కడ పని చేస్తుండగా విద్యుత్ తీగ తగలడంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. రవి మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 19, 2024

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి బుధవారం జిల్లా కలెక్టర్ అబ్దుల్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో తిరుగుతూ అక్కడ చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి, వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు.