Khammam

News May 19, 2024

ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..!

image

మెగా ఫుడ్ పార్క్ ఖమ్మంలోని బుగ్గపాడులో వచ్చే నెలలో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ముడి వనరులు పుష్కలంగా లభించడం. ఇప్పటికే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో 203 ఎకరాల్లో జామ, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, ఆయిల్‌పామ్, సపోటా, నిమ్మ, మొక్కజొన్న పంటలను సాగు చేసేలా రైతుల్ని అధికారులు ప్రోత్సహించారు. అంతేగాక ఫుడ్‌పార్క్‌కు రవాణా సదుపాయాలు చేరువుగా ఉండడం.

News May 19, 2024

KMM: టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో..!

image

టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News May 19, 2024

NTRను కలిసేందుకు ఖమ్మం నుంచి HYDకి నడక

image

హీరో జూనియర్ NTRను కలవాలనే కోరికతో ఓ అభిమాని పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్‌కు వచ్చాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు చెప్పుల్లేకుండా 300 కిలోమీటర్లు నడిచాడు. తనను చూసేందుకు ఎంతో శ్రమించి ఇంటికి వచ్చిన నాగేంద్రను కలిసిన ఎన్టీఆర్ అతడితో ఫొటో దిగాడు. అభిమాన హీరో కలవడంతో అతడు తెగ సంబరపడుతున్నాడు.

News May 19, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు మద్దతు:తమ్మినేని

image

KMM-NLG-WGL పట్టభద్రుల MLC స్థానానికి జరిగే ఉపఎన్నికకు కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడూ BJPని ఓడించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. పట్టభద్రులైన ఓటర్లు మల్లన్నను గెలిపించాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

News May 19, 2024

ఖమ్మం: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి 27,475 మంది

image

జూన్‌ 9న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలపై టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన కాన్ఫరెన్స్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. మొత్తం 27,475 మంది 73 కేంద్రాలలో పరీక్ష రాయనున్నట్లు వివరించారు. జూన్‌ 9న ఉదయం 10-30నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌ తెలిపారు.

News May 19, 2024

ఖమ్మం: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 సంవత్సరానికి ఖమ్మం జిల్లాలోని విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనానికి మే 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్ స్థాయి పీహెచ్‌డీ పోస్ట్, డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం నందు చదవాలనుకునే గిరిజన విద్యార్థిని, విద్యార్థులు ఈ పథకానికి అర్హులని అన్నారు.

News May 18, 2024

త్వరలో ట్రయల్‌ రన్‌..

image

చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు వద్ద ప్రత్యేక సాంకేతికత పనులు సాగుతున్నాయి. త్వరలో సాఫ్ట్‌వేర్‌ పనులను పూర్తిచేసి ట్రయల్‌ రన్‌ వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈఎం బ్రేక్స్‌ వంటి పనులను అధికారులు పూర్తిచేశారు. ఈ లోగానే మెయింటెనెన్స్‌ , ఇతర మెకానికల్‌ పనులు ముగిస్తామని తెలిపారు.

News May 18, 2024

ఖమ్మం: RTC బస్సు కిందపడి మహిళ దుర్మరణం

image

కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డులో ప్రయాణం చేస్తున్న సదరు మహిళ ఫుట్ బోర్డు నుంచి జారి అదే బస్సు వెనక టైర్ కిందపడి దుర్మరణం చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి.

News May 18, 2024

ఖమ్మం: ఇంకా ఎనిమిది రోజులే!

image

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్‌ జరగనుంది. రాకేశ్ రెడ్డి (BRS), తీన్మార్ మల్లన్న (INC), ప్రేమెందర్ రెడ్డి (BJP)తో పాటు మరో 49 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 4,61,806. పోలింగ్‌కు ఎనిమిది రోజులే ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

News May 18, 2024

ఖమ్మం జిల్లాలో దారుణం.. తల్లి, పిల్లలను చంపిన వ్యక్తి

image

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన తల్లి, ఇద్దరు పిల్లలను చంపేశాడు. మృతులు తల్లి పిచ్చిమ్మ(60), కుమార్తెలు నీరజ (10), ఝాన్సీ (6). పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.