Khammam

News May 18, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కొత్తగూడెం పట్టణంలో జడ్పీ సర్వసభ్య సమావేశం
∆} వివిధ శాఖలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} జూలూరుపాడు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News May 18, 2024

కొత్తగూడెం: పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ 5 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పునిచ్చారు. అశ్వాపురం మండలానికి చెందిన ఓ మహిళ తన మనవరాలితో కలిసి నివసిస్తుంది. 2021 డిసెంబర్ 30న మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటి పక్కనే ఉన్న సాంబశివరావు అనే వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు విచారించి శిక్ష విధించారు.

News May 18, 2024

కామేపల్లిలో భీకరంగా ప్రవహిస్తున్న బుగ్గ వాగు

image

కామేపల్లి మండల పరిధిలోని పింజరమడుగు పొన్నెకల్లు రెవెన్యూ గ్రామాలకు ఆనుకుని ఉన్న బుగ్గవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గురువారం రాత్రి ఇల్లందు కారేపల్లి కామేపల్లి మండలాలలో భారీగా కురిసిన వర్షాలకు బుగ్గవాగు ఉగ్రరూపం దాల్చి భీకరంగా ప్రవహిస్తుంది. బుగ్గవాగు ఉధృతితో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశువులకు మేకలకు తాగునీరు దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో వాతావరణం చల్లబడింది.

News May 17, 2024

కుక్కునూరు: డోలిలో గర్భిణీ మహిళ తరలింపు

image

పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను గ్రామస్థులు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ డోలిలో అంబులెన్స్ వద్దకు తరలించి ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఘటన కుక్కునూరు మండలంలోని లచ్చి పేట గ్రామంలో జరిగింది. లచ్చిపేట గ్రామానికి చెందిన కోసి అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో 108 అంబులెన్స్‌కు ఆ గ్రామం చేరుకునే దారి లేకపోవడంతో గ్రామస్థులు డోలీలో మహిళను అంబులెన్స్ వరకు తరలించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

News May 17, 2024

మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

image

టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బుగ్గపాడులో త్వరలోనే పరిశ్రమల స్థాపన, వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఖమ్మం మార్కెట్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

News May 17, 2024

KMM: మల్లన్నను తప్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత ధర్నా

image

ఖమ్మం: స్మశానానికి పంపుతారా-శాసన మండలికి పంపుతారా అని 4.61 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిన తీన్మార్ మల్లన్నను ఎన్నికల బరి నుంచి తొలగించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు.

News May 17, 2024

ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా అకాల వర్షానికి చాలా చోట్ల వడ్లు తడిసి పోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈదురుగాలుల ప్రభావానికి కొన్ని ప్రాంతాలల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. గాలి వానకు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు కరెంట్ స్తంభాలపై పడగా. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

News May 17, 2024

ఖమ్మం: పట్టభద్రులూ.. సరిగా ఓటేయండి

image

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

News May 17, 2024

కొత్తగూడెం: యువతిపై అత్యాచార యత్నం 

image

సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిపై ఈనెల 12న రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు కథనం ప్రకారం.. ఇంట్లో ఉన్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. కులం పేరుతో దూషించాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై జుబేదా బేగం తెలిపారు.

News May 17, 2024

సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.