India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొత్తగూడెంలో కేఏ పాల్ సమగ్ర శిక్షా ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. కలెక్టరేట్ సమీపంలో ధర్నా నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆకస్మికంగా రోడ్డుపైన కేఎ పాల్ కనపడడంతో జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మణుగూరు సమీపంలోని పగిడేరులో ప్రజాశాంతి పార్టీ సమావేశానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారం వ్యక్తం చేశారు. బలగం మూవీ ఫేమ్ మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రఘునాథపాలెం మండలం దానవాయిగూడెం MJPT బీసీ హాస్టల్ విద్యార్థిని లక్ష్మి భవాని కీర్తిని ఎలుక కరవడంతో మార్చి 2024లో ARV, TT ఇంజక్షన్లు అందించామని జిల్లా వైద్యాధికారి కళావతి బాయి చెప్పారు. తర్వాత హోమియో మందులు, స్కిన్ క్లినిక్ సేవలు ఇంటి వద్ద పొందారన్నారు. డిసెంబర్ 11న కాలి నొప్పితో మమత ఆసుపత్రిలో చేరగా, వెన్నెముక పరీక్షలో ప్రోటీన్ శాతం పెరిగినట్లు తేలిందన్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

వ్యక్తిని హత్య చేసిన కేసులో ఆరుగురికి శిక్ష పడింది. పెనుబల్లి మండలం బ్రహ్మళకంట గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి నర్సింహారావు కారణమని గోపి కక్ష పెంచుకున్నాడు. 2019 సెప్టెంబర్ 10న నర్సింహారావును గోపి, ఆయన స్నేహితుడు హత్య చేశారు. వీరికి సహకరించిన ఐదుగురిపై కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సత్తుపల్లి ఆరో అడిషనల్ జడ్జి శ్రీనివాస్ తీర్పు ఇచ్చారు.

వ్యాపార విస్తరణ, లాభార్జనపై మహిళలకు అవగాహన కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా మార్ట్, ఇందిరా మహిళ శక్తి అమలుపై కలెక్టర్ ముజమ్మిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. సంఘాలు తయారు చేసే సామాగ్రిలను అమ్మేందుకు మహిళా మార్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు.

ఏ ప్రభుత్వానికైనా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉంటుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. విద్యాలయాలను బాగు చేయాలని కేసీఆర్‌కు మొదట్లో ఉండేదని, తరువాత ఆయన అంచనాలు మారిపోయాయన్నారు. “విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే కసి సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోంది. నిర్ణయాలలో అది స్పష్టమవుతోంది. సీఎం ఒక్కరికే తపన ఉంటే సరిపోదు. దానిని అందరూ ఆచరించాలి” అని పేర్కొన్నారు.

దేశంలో జమిలి ఎన్నికలు చాలా ప్రమాదకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం సత్తుపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సీపీఎం జిల్లా 22వ మహాసభలకు హాజరై మాట్లాడారు. 75ఏళ్ల దేశ రాజ్యాంగానికి నష్టం కలిగించే అనేక అంశాలు బీజేపీ ప్రవేశ పెడుతుందని అన్నారు. మతతత్వ రాజ్యాంగాన్ని తేవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. రైతులను నాశనం చేసేందుకు నల్ల చట్టాలను ఏర్పాటు చేస్తుందన్నారు.

ఇంటర్మీడియట్ MPHW(ఫిమేల్) ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు క్లినికల్ అప్రెంటిస్షిప్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారు రూ.1,000 డీడీ. రూపంలో చెల్లించాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని, ఎంపిక కాని వారు కూడా తాజాగా కలెక్టరేట్లోని ఇంటర్మీడియట్ ఆఫీసులో ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

వైరాలోని రింగ్ రోడ్డులో జరిగిన <<14914865>>రోడ్డు ప్రమాదం<<>>లో లారీ కిందపడి బాలిక మృతిచెందిన విషయం తెలిసిందే. రఘునాథపాలెం మండలం కోయచిలుకకి చెందిన చెరుకూరి హర్షశ్రీ(13) వైరా గురుకులంలో 7వ తరగతి చదువుతోంది. తండ్రి ఇరుముడి కోసం ఇంటికి వచ్చి బైక్‌పై మేనమామ శ్రీకాంత్‌తో తిరుగు ప్రయాణమైంది. వైరా రింగ్ రోడ్డులో ట్రాక్టర్‌ను తప్పించబోయి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఎస్ఐ వంశీకృష్ణ కేసు నమోదు చేశారు.

ప్రియురాలికి ఫోన్ కొనివ్వడానికి తల్లిని హతమార్చిన ఘటన ఖమ్మంలో జరిగింది. <<14907347>>ఖానాపురానికి <<>>చెందిన లక్ష్మీనారాయణ-వాణి దంపతులు. చిన్న కుమారుడు గోపి మద్యానికి బానిసయ్యాడు. ఫోన్ కొనేందుకు డబ్బు కావాలని తల్లిని అడిగాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో బంగారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఒప్పుకోకపోవడంతో గోపి తన తల్లిని హత్య చేశాడని తండ్రి ఫిర్యాదు చేశాడు
Sorry, no posts matched your criteria.