Khammam

News May 15, 2024

ఖమ్మం: స్వల్పంగా పెరిగిన పోలింగ్.. గెలుపు ఎవరిది…?

image

ఖమ్మం MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 75.30శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 76.09 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి నామా(BRS) 1,68,062 మెజార్టీతో రేణుకా చౌదరి(INC)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 15, 2024

ఓటు వేస్తూ వీడియో తీసిన యువకుడిపై కేసు నమోదు

image

ఓటు వేస్తూ సెల్ ఫోన్‌లో వీడియో తీసి, దాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన యువకుడిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో  కేసు నమోదైంది. ఎస్ఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం జరిగిన ఎన్నికల్లో ఏదులాపురానికి చెందిన ఏపూరి తరుణ్ సెల్ ఫోన్‌తో పోలింగ్ బూత్లోకి వెళ్లి తాను ఓటు వేసిన గుర్తు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు అందగా కేసు నమోదు చేశారు.

News May 14, 2024

వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం వాజేడు ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైకుపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

FINAL: ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 76.09%

image

ఖమ్మం లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఖమ్మం – 62.97%, పాలేరు -83.77%, మధిర -81.84%, వైరా-81.06%, సత్తుపల్లి-80.34%, కొత్తగూడెం -69.47%, అశ్వారావుపేట- 80.95%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 76.09% శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా, బీజేపీ తరఫున వినోద్ రావు పోటీ చేశారు.

News May 14, 2024

KTDM: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. తునికిబండల గ్రామానికి చెందిన గిరిజన రైతు ఈసం రామయ్య చిన్న కూతురు ఈసం రమ్య (20) అనే యువతి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడింది. నోటి నుంచి నురగ వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

BRSకు మంచి సీట్లు వస్తాయి: నామా

image

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ పార్టీ విజయానికి సోపానమని BRS ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో సానుకూల ప్రభావం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో BRSకు మంచి సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం ఓటర్లు విజ్ఞతతో ఓటు వేశారని ఆయన వ్యాఖ్యానించారు.

News May 14, 2024

కాంగ్రెస్‌కు 12 నుంచి 14 సీట్లు: డిప్యూటీ సీఎం భట్టి

image

కాంగ్రెస్‌కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలు తమ పార్టీని విశ్వసించారని చెప్పారు. కేంద్రంలోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. సెంటిమెంట్ రగిలించేందుకు బీజేపీ ప్రయత్నించి విఫలమైందన్నారు.

News May 14, 2024

కుటుంబ కలహాలతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. హత్యతండాకు చెందిన బాదావత్ శంకర్ కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామ సమీపంలోని పొలాల వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News May 14, 2024

మంత్రి పొంగులేటి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

image

ఖమ్మం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లవలసిన విమానంలో సాంకేతిక లోపం వల్ల దాదాపు గంట వరకు టేకాఫ్ కాకుండా రన్ వే పైనే నిలిచిపోయింది. కాగా మంత్రితో పాటు విమానంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. కాగా విమానంలో సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

35 ఏళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్న మాదన్న

image

న్యూడెమోక్రసీ దళ సభ్యుడిగా పనిచేసి 35 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు 50 ఏళ్ల వయస్సులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందు మండలం కొమరారంలో సోమవారం ఆయన ఓటు వేశారు. చిన్నతనంలోనే అజ్ఞాత దళ సభ్యుడిగా చేరిన మధు కమాండర్ స్థాయికి ఎదిగారు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా అరెస్ట్ అయిన ఆయన బెయిల్ పై బయటకు వచ్చినా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.