Khammam

News December 15, 2024

ఖమ్మం: దుబాయ్ పారిపోయిన వ్యక్తి అరెస్ట్

image

మైనర్ బాలికను వేధించిన ఖమ్మం(D) పోలేపల్లికి చెందిన యలమల్ల సతీష్‌ని LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మన్సూరాబాద్‌లో అక్క, బావ వద్ద ఉంటూ అదే కాలనీలో మైనర్ బాలికను వెంటపడుతూ, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధించేవాడు. రాత్రుల్లో ఆమెని పిలుస్తూ ఇబ్బంది పెట్టేవాడు. అక్టోబర్‌లో కేసు నమోదవగా నిందితుడు దుబాయ్ పారిపోయాడు. వారం క్రితం వచ్చిన అతన్ని విచారించి రిమాండ్‌కు పంపామని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.

News December 15, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని సూచించారు.

News December 15, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన

image

ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు అమ్మేసిన ఘటన భద్రాద్రి జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. జూలూరుపాడు మం. కొమ్ముగూడెంకు చెందిన ఓ మహిళ గత అక్టోబర్‌లో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే పాప, బాబు ఉండగా మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో సాకలేమని లక్ష్మిదేవిపల్లి మం. చెందిన దంపతులకు రూ. లక్షకు అమ్మినట్టు తెలిస్తొంది. స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> వైరాలో ఉచిత వైద్య శిబిరం
> మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
> ఖమ్మంలో ప్రకృతి వ్యవసాయ సదస్సు
> సత్తుపల్లిలో యుటిఎఫ్ జిల్లా మహాసభ
> వేంసూరులో సిపిఎం పార్టీ ఇంటింటి ప్రచారం
> ఉమ్మడి జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష
> భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో కృత్రిమ దీపోత్సవం
> మధిర వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం

News December 15, 2024

జనరిక్ ఔషధాల ప్రోత్సాహానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటి?: ఎంపీ

image

ఖమ్మం: సామాన్య ప్రజానీకానికి వ్యయభారం తగ్గించేలా.. జనరిక్ ఔషధాల విక్రయాల పెంపునకు, వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకం అందిస్తుందని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన బ్రాండెడ్ మందుల ధరలను నియంత్రించడంలో ఏ మేరకు సఫలీకృతులవుతున్నారని అడిగారు.

News December 14, 2024

విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి తుమ్మల 

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించారు. నూతన మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టూడెంట్స్ కు నాణ్యమైన భోజనం అందించాలని మెస్ ఛార్జీలు రెట్టింపు చేశామన్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. వారితో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఉన్నారు. 

News December 14, 2024

సమాఖ్య స్ఫూర్తికి జమిలి ఎన్నికలు విరుద్ధం: కూనంనేని

image

జమిలి ఎన్నికలు నిర్వహించాలనే కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ విధానంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానంతో ప్రాంతీయ పార్టీల హక్కులకు భంగం కలిగే అవకాశమున్నందున తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

News December 14, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన > కొత్తగూడెం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ > పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన > న్యాయవాదులకు ఉచిత వైద్య శిబిరం > డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన > బూర్గంపాడు: విద్యుత్ సరఫరాకు అంతరాయం > ఖమ్మంలో సీపీఎం నిరసన

News December 14, 2024

మంత్రి పొంగులేటి నేటి పర్యటన వివరాలు

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి తంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం, పెరికాసింగారం, తిరుమలయపాలెం మండలం మాదిరిపురంలలో జరుగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని వివరించారు.

News December 14, 2024

ఖమ్మం: ఓటర్ జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి : ఎన్నికల అధికారి

image

ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఓటర్ సవరణ జాబితా 2025పై ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు.