India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం నిత్య బలిహరణం, తదితర నిత్యపూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రెండు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం చింతకాని, బోనకల్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం జమలాపురం, మధిర మండలం కిష్టాపురం గ్రామాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.

ఖమ్మం మున్సిపల్ ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగారన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ ఉద్యోగులు మనసుపెట్టి విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయని అధికారులు ఇంటికి వెళ్లాల్సి వస్తోందని మంత్రి తుమ్మల హెచ్చరించారు. గతంలో ఎవరి ఒత్తిళ్ల వల్ల తప్పు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని మంత్రి సూచించారు.

కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి మోడల్ నమూనా నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు. పేదవాడి ఇంటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.

తొమ్మిదో మైలు తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కిష్టారానికి చెందిన లక్ష్మణ్ గురువారం రాత్రి ఇల్లందు నుంచి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో RMP తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన SI సురేష్ పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుండాల, కరకగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా గతంలో గుండాల, పాండవులు గుట్ట, ఇల్లందులో పెద్ద పులులు సంచరించేవని స్థానికులు చెబుతున్నారు. 2000 సం. NOVలో ఈ ప్రాంతంలో పెద్ద పులి ఆవులపై దాడి చేసిందన్నారు. రెండు దశాబ్దాల తర్వాత 2020లో ఒకసారి, 2022లో మరోసారి సంచరించాయన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత పులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ అధికారులు వెతుకున్నారు. ములుగు జిల్లాలో చలి క్రమంగా పెరుగుతుండడంతో ఇటు వచ్చినట్లు తాడ్వాయి అటవీ అధికారులు చెబుతున్నారు. గురువారం కరకగూడెం మీదుగా గుండాల వైపునకు పెద్దపులి ప్రయాణం సాగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చలికాలం అంతా పులులకు సంభోగ సమయమని మగ పెద్దపులి, ఆడపులి కోసం వెదుకుతుండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటి సర్వే ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో గర్భస్థ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టంపై జిల్లా మల్టీ మెంబెర్ అప్రోప్రియేట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యా శాఖాధికారి సహకారం తీసుకొని విద్యార్థులకు ఆడపిల్ల పట్ల వివక్షతపై చర్చించాలని చెప్పారు. ముఖ్యమైన ప్రదేశాలలో హార్డింగ్స్ పెట్టాలన్నారు.

గిరిజన విద్యార్థులు ఫ్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు అప్లై చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.