India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రపంచాన్ని మార్చే శక్తి కమ్యూనిజానికి మాత్రమే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఏదులాపురంలో పాలేరు డివిజన్ 8వ మహాసభ నిర్వహించారు. పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు కమ్యూనిస్టులంటే భయమని చెప్పారు. అందుకే కమ్యూనిస్టులపై నిత్యం విష ప్రచారం చేస్తూ, బురద చల్లుతూ ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటారని విమర్శించారు.

ఖమ్మం: షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటిని క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ డా. షమీమ్ అక్తర్ తెలిపారు. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్సీ కులాలు, కుల సంఘాలు, వ్యక్తులతో బహిరంగ విచారణ నిర్వహించారు. బహిరంగ విచారణలో 450 మంది వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా దరఖాస్తులు సమర్పించారని పేర్కొన్నారు.

ఖమ్మం నగర పరిధిలో కార్పొరేషన్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్‌లో విలీనమైన పంచాయతీల్లో కార్మికుల కొరత, తాగు నీటి సమస్యలు, ఫాగింగ్ యంత్రాలు, పనిముట్లు లేవని క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 15 నుంచి 16 వరకు జరిగే గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని చెప్పారు. అటు పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.

కేయూ పరిధిలో ఈ నెల 18న జరగాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. తిరిగి పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల వాయిదా విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్లో అధికారులు అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35,000 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్ల సమీక్షా సమావేశం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో మంచినీటి సరఫరా బంద్ ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఏసీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ బహిరంగ విచారణ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. విచారణ కమీషన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల సంఘ నాయకులు అధిక సంఖ్యలో హాజరై వారి వినతులను అందజేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఎడాదిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కలెక్టరేట్‌లో ఓ అధికారి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఖమ్మం రేంజ్ కార్యాలయం నెంబర్లు-9154388981, 08742-228663, ఈ-మెయిల్ dsp_acb_kmm@telangana. gov.inను సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.