India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.
కొనిజర్లలో విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. కొనిజర్ల ఆయుర్వేద వైద్యశాలలో కరెంటు మరమ్మతులు చేస్తుండగా విద్యాద్ఘాతంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. మృతుడిని వైరా మండలం గొల్లపూడికి చెందిన సతీశ్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
విద్యుత్ బిల్లుల చెల్లింపును మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్ ) క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గడిచిన మే నెలలో ఖమ్మం సర్కిల్ పరిధిలో 1,19,678 మంది గృహ విద్యుత్ వినియోగదారులు రూ.24.47 కోట్ల బిల్లులను ఆన్లైన్లో చెల్లించారు. ఇక భద్రాద్రి జిల్లాలో 71,865 గృహ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా రూ.13.97 కోట్లను చెల్లించారు.
పాముకాటుతో ములుగు జిల్లా మంగపేట మండలంలో దండాల రాణి అనే బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలకు చెందిన దండల రాణి అనే బాలిక బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో దేవానగరంలోని పెద్దమ్మ ఇంట్లో పాముకాటుకు గురైంది. ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,100 పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.100, అటు పత్తి ధర రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. కాగా మార్కెట్లో రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా క్రయవిక్రయాలు జరపాలని అధికారులు సూచించారు.
ఎర్రుపాలెం: జమలాపురం యూనియన్ బ్యాంక్లో డ్వాక్రా మహిళలకు ఓ వ్యక్తి కుచ్చు టోపీ పెట్టాడు. సీసీ సంతకాన్ని ఫోర్జరీ చేసి వెంకటాపురంలో ఉన్న 30గ్రూపులకు చెందిన 300మంది సభ్యుల రూ.28.3లక్షలను డ్రా చేసుకొని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న మహిళలు బ్యాంకు వద్దకు వెళ్లిఆందోళన చేపట్టారు. రెండు దఫాలుగా డబ్బులు చెల్లిస్తానని బ్యాంకు మేనేజర్ సమక్షంలో కన్నయ్య ఒప్పుకోవడంతో ఆందోళనను విరమించారు.
నేటి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు 6,84,740 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఈ మొత్తాన్ని ఇప్పటికే సంబంధిత పాఠశాలలకు సరఫరా చేశారు. 3,94,314 రాతపుస్తకాలను సైతం అందుబాటులో ఉంచారు. ఈసారి నూరు శాతం పుస్తకాలు పాఠశాలలకు చేరటం విశేషం.
భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడికి మంగళవారం ఓ వ్యక్తి ఫోన్ చేసి పోలీస్ అధికారినంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వైద్యుడు ఎవరికి చెప్పాలో అర్థంకాక కొంతసేపు ఇబ్బంది పడ్డారు. చివరకు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ను ఆశ్రయించి విషయం వివరించారు. అయితే సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిసింది. అయితే సదరు వైద్యుడు ఫిర్యాదు చేయలేదని సమాచారం.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బడి బాట, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపూర్తిపై విద్యాశాఖ, ఇంజనీరింగ్, మండలసమాఖ్యలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కొబ్బరి చిప్పలు, ఖాళీ బొండాలు, కోడి గుడ్డు పెంకులు, మొక్కల తొట్టిలు, వృథాగా ఉన్న టైర్లు, వేసవిలో వాడిన కూలర్లలో నీళ్లు ఉంటే దోమలు తయారై డెంగీ ప్రబలే అవకాశం ఉంది. మురుగు, నిల్వ నీరు మలేరియా, ఫైలేరియా ప్రబలేందుకు దోహదం చేస్తాయి. వానాకాలంలో పరిస్థితి మరింత తీవ్రత చాటే అవకాశం ఉన్న దృష్ట్యా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
Sorry, no posts matched your criteria.