India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న వర్షాకాలం నేపథ్యంలో 3 నెలలు జిల్లా అధికారులు, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు మరమ్మతులు అవసరమున్న చోట వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాలు కారణంగా రెడ్ జోన్లో ఉండే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వెంటనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని కోరారు.
ధరణి పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవిన్యూ అధికారులతో ధరణి, రిజిస్ట్రేషన్ల పెండింగ్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి ఫిజికల్ ఫైళ్ల ఆన్లైన్ అప్లోడ్ ప్రక్రియలో వేగం పెంచాలన్నారు.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మల్లన్న మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. తన గెలుపు కోసం కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దన్నారు. నీటి ప్రవాహంలో ఉన్న కాలువలు, కల్వర్టులను దాటొద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తడిసిన విద్యుత్ స్తంభాలను తాకొద్దని, ప్రయాణాలను కూడా కొత్త మార్గాల్లో కాకుండా రోజు వెళ్లే దారిలోనే ప్రయాణించాలని పేర్కొన్నారు.
అశ్వారావుపేటకు చెందిన ఇద్దరు యువకులు సోమవారం ఏపీలోని వేలేరుపాడు మండలంలో గల కట్కూరు శివాలయానికి దర్శనానికి వెళ్లారు. కాగా శివాలయం సమీపంలో ఉన్న గోదావరిలో సదరు యువకులు స్నానానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరమ్మాయిల ప్రేమ చివరికి విషాదంగా మారింది. MHBD జిల్లా కురవి (M)కి చెందిన ఓ యువతికి(21), బయ్యారంకు చెందిన మరో యువతి(20) ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి HYDకు వెళ్లిపోయారు. వివాహం చేసుకొని సహజీవనం చేస్తుండగా పెద్దలు వారిని విడదీశారు. కురవి(M)కి చెందిన అమ్మాయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న మరో యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఖమ్మం జిల్లాలో రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు గట్టినిఘా పెట్టినా వారి కళ్లు గప్పి దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం కొత్తబస్టాండ్‌లో చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.6 లక్షల విలువైన బంగారు అభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
క్రికెట్ ఆడుతూ గుండెనొప్పికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇల్లెందులో ఆదివారం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలో 2బస్తీకి చెందిన బొల్లి కిరణ్ (27) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాగా ఆయాసం వచ్చింది. వెంటనే తోటి స్నేహితులు స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. కిరణ్‌ను పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం రిఫర్ చేశారు. ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా పరీక్షకు 20,504 మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 2,226మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్ష ఉ. 10.30 నుంచి ఒంటిగంట వరకు కొనసాగింది. కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.