Khammam

News June 10, 2024

ఐఈడీ మందు పాతరలు నిర్వీర్యం

image

వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రవరం గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 4 ఐఈడీ మందు పాతరలను బీడీ బృందాలు గుర్తించినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేశామన్నారు. మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మందు పాతరలను అమర్చి, అమాయకుల ప్రాణాలను తీస్తున్నారన్నారు. వీటిలో ఇప్పటికే 3 పేలిపోగా .. ఒక మందు పాతరను నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.

News June 9, 2024

పైరవీలకు తావు లేదు.. అర్హులకే పెన్షన్: మంత్రి పొంగులేటి

image

ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ పద్ధతిలో పెన్షన్ పొందిన వాటిని రద్దు చేస్తామన్నారు. అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

News June 9, 2024

నాలుగో ప్రయత్నంలో విజయం

image

రెండుసార్లు MLCస్థానానికి, ఒకసారి MLAస్థానానికి పోటీచేసి ఓడిపోయిన మల్లన్న.. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. 2015లో NLG- KMM-WGLఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో HZNR అసెంబ్లీ ఉపఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడారు. 2021లో NLG- KMM-WGLఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం అదే స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో మల్లన్న విజయం సాధించారు.

News June 9, 2024

మిషన్ భగీరథ నీరు వస్తోందా.. ?!

image

ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షల ఇళ్లకు.. భద్రాద్రి జిల్లాలో కూడా దాదాపు అదేసంఖ్యలో ఇళ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో చాలా ఇళ్లకు నీరు అందడం లేదని, పైపులైన్లు పగిలిపోయి, వాల్వ్ ల వద్ద లీకేజీలతో నీరు వృథా అవుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యాన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటిని సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News June 9, 2024

KMM: కేయూలో రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

జూన్ 11 నుంచి ప్రారంభం కావాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ PG సెకండ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి, అదనపు నియంత్రణ అధికారి డాక్టర్ బి.ఎస్.ఎల్ సౌజన్య తెలిపారు. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో తెలియజేస్తామన్నారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

News June 9, 2024

నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే..

image

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత 2007లో శాసనమండలి వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. WGL–KMM–NLG గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా తొలిసారి టీఆర్‌ఎస్‌ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ కపిలవాయి విజయం సాధించారు. 2015 తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. మళ్లీ 2021ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.

News June 9, 2024

ఖమ్మం జిల్లాతో రామోజీరావుకు అనుబంధం

image

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సారా వ్యతిరేక ఉద్యమంలో రామోజీరావు పాల్గొన్నారు. 1994 నవంబర్ 4న ఖమ్మం రిక్కాబజార్‌ పాఠశాలలలో జరిగిన సదస్సుకు ఆయన వావిలాల గోపాల కృష్ణయ్యతో కలిసి హాజరయ్యారు. అప్పటి పీవైఎల్‌ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నల్లమల వెంకటేశ్వరరావు, డీఐఎఫ్‌ఐ నాయకుడు విడియం వెంకటేశ్వర్లులతో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యమ విస్తృతిపై దిశానిర్దేశం చేశారు.

News June 9, 2024

ఖమ్మం జిల్లాలో 52, కొత్తగూడెం జిల్లాలో 21 సెంటర్లు

image

TGPSC ఆధ్వర్యంలో ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇరు జిల్లాల కలెక్టర్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో 21 సెంటర్లలో మొత్తం 8,871 మంది, ఖమ్మం జిల్లాలో 52 సెంటర్లలో 18,403 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉ.9 గంటలకే చేరుకోవాలని నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.

News June 8, 2024

కొత్తగూడెం: తాటి చెట్టుపై నుంచి జారిపడి యువకుడి మృతి

image

తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. చింతపల్లికి చెందిన శివ(25) శనివారం తాటి ఆకుల కోసం చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందాడు.

News June 8, 2024

గ్రూప్-1 ఎగ్జామ్, ఖమ్మం ఆర్టీసీ RM కీలక సూచన 

image

రేపు జరగబోయే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఖమ్మం జిల్లా పరిధిలో హాజరుకాబోయే 18,403 అభ్యర్థులకు రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్లకు రీజినల్ మేనేజర్ వెంకన్న ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయాలని కోరారు. ఎంక్వయిరీ కోసం 99592 25979, 99592 25965 సంప్రదించగలరు.