Khammam

News June 8, 2024

ఇకనైనా ప్రత్యేక పాలన.. పట్టాలెక్కేనా?

image

గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి జిల్లాలో 481 జీపీలు ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. 3 నెలలుగా లోక్ సభ ఎన్నికల క్రతువులో అధికార యంత్రాంగం నిమగ్నమవటంతో పంచాయతీల పాలనపై పర్యవేక్షణ కొరవడింది. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్ శనివారంతో ముగియనుంది. ఇకనైనా జీపీ పాలనపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

News June 8, 2024

ఖమ్మం: కాంగ్రెస్ ఫస్ట్ టైం విన్

image

NLG-WGL-KMM పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపుతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ఈ స్థానాన్ని ఫస్ట్ టైం గెలుచుకున్నట్లైంది. 2015, 21లో ఈస్థానాన్ని బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) గెలుచుకుంది. ఈ సారి మాత్రం పట్టభద్రులు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.

News June 8, 2024

మూడవసారి గిన్నిస్ రికార్డును అందుకున్న గౌరీశంకర్

image

సత్తుపల్లికి చెందిన సూక్ష్మకళాకారుడు గుమ్మడిదల గౌరీశంకర్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా 3 సారి రికార్డు పొంది హ్యాట్రిక్ వీరుడయ్యాడు.పెన్సిల్ లెడ్ను ఉపయోగించి ఇదివరకు 617 లింక్లతో ఉన్న గిన్నిస్ రికార్డు అధిగమించాడు. పెన్సిల్ లెడ్తో ఏకంగా 9 అడుగుల పొడవు ఉండేలా 1,125లింకులు చేసి ఆ రికార్డ్ను బద్దలు కొట్టాడు.ఇందుకోసం దాదాపు 6 నెలలపాటు శ్రమించినట్లు గౌరీ శంకర్ తెలిపారు

News June 8, 2024

తీన్మార్ మల్లన్న విజయం.. రేవంత్ రెడ్డి విషెస్

image

పట్టభద్రుల MLCగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇదే స్థానంలో గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు.

News June 8, 2024

ఖమ్మం చరిత్రలో భారీ మెజార్టీ

image

కూసుమంచి: ఖమ్మం ఎంపీ ఎన్నికల చరిత్రలో ఏ ఎంపీకీ రాని మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాయకన్ గూడెంలో స్థానిక నేతలతో నిర్వహించిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. మొదటి విడతలో ఇళ్లు, రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అతి త్వరలోనే అర్హులైన అందరికీ ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని పేర్కొన్నారు.

News June 8, 2024

ఖమ్మం కలెక్టర్ గౌతమ్ కీలక ఆదేశాలు

image

గ్రూప్ 1 అభ్యర్థులకు ఖమ్మం కలెక్టర్ గౌతమ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు బూట్లు, అభరణాలు వేసుకుని రావొద్దని సూచించారు. జిల్లాలో మొత్తం 52 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 18,403 మంది హాజరవుతారన్నారు. నిమిషం ఆలస్యమై పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదన్నారు.

News June 8, 2024

మూడు రోజుల పాటు నానా అవస్థలు

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక లెక్కింపు 60 గంటలకు పైగా సాగింది. కౌంటింగ్‌లో మొత్తం 52మంది అభ్యర్థులు, 3వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 12 గంటల పాటూ ఏకధాటిగా విధుల్లో ఉండడంతో అలసిపోయారు. గోదాముల్లో కూలర్లు ఏర్పాటు చేసినా అక్కడి ఉక్కపోతతో కొంతమంది డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. గతంలో 56 టేబుళ్లపై లెక్కించగా.. ఈ దఫా 96టేబుళ్లపై ఓట్లను లెక్కించిన ప్రక్రియ ఆలస్యమవడంతో అవస్థలు పడినట్లు తెలిపారు.

News June 8, 2024

ఓటమిని అంగీకరిస్తున్నా: రాకేశ్ రెడ్డి

image

WGL-KMM-NLG BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమిపై స్పందించారు. ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ, నైతికంగా గెలిచానని అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొసం ప్రజా క్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.

News June 8, 2024

వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు ఆహ్వానం

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ విద్యాసంస్థలో వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. అనూష తెలిపారు. ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై టీఎస్ పాలిసెట్ లో ర్యాంకు పొందినవారు అర్హులని తెలిపారు. 2సంవత్సరాల వ్యవధి ఉండే డిప్లొమా కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశానికి 60 సీట్లు ఉన్నాయన్నారు.

News June 7, 2024

బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్.. ఆధిక్యంలో మల్లన్న

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ లో BJPఅభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఎన్నికల అధికారులు ఎలిమినేషన్ చేశారు. కాగా ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. BJP అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, BRS అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.