Khammam

News May 7, 2024

పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2024

లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల పరీక్షకు మరో ఆరు రోజులే..!

image

KMM, MHBD పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల పరీక్షకు మరో 6 రోజులే ఉన్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తీరిక లేకుండా ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈరోజు విక్టరీ వెంకటేష్ రావడంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. అటు నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు.

News May 7, 2024

మంత్రి పొంగులేటిని కలిసిన సినీ హీరో వెంకటేశ్

image

ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరఫున ఖమ్మంలో నేడు సినీ హీరో వెంకటేశ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన ఇప్పటికే ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటి అయ్యారు. సాయంత్రం 5 గంటలకి ఖమ్మంలో జరిగే రోడ్‌ షోలో పాల్గొంటారు.

News May 7, 2024

ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్న విక్టరీ వెంకటేశ్

image

సినీ హీరో విక్టరీ వెంకటేశ్ మంగళవారం ఖమ్మానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఆయనకు పొంగులేటి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం నగరంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

News May 7, 2024

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: అశోక్

image

వరంగల్, ఖమ్మం, నల్లగొండ MLC స్వాతంత్ర్య అభ్యర్థిగా పాలకురి అశోక్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆయన రేపు నల్లగొండలో ఆయన నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. లైబ్రరీలు, కార్యాలయాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి మంచి స్పందన వస్తోందని, పట్టభద్రులు తనను గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అశోక్ పేర్కొన్నారు.

News May 7, 2024

KMM: బీఫామ్ అందుకున్న తీన్మార్ మల్లన్న

image

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేయగా.. ఈరోజు CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. పట్టభద్రులు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

News May 7, 2024

KMM: సింగరేణి ఉద్యోగి భార్య సూసైడ్

image

మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మణుగూరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. PV కాలనీకి చెందిన విజయలక్ష్మి (42) భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతిరాలి భర్త సింగరేణి ఉద్యోగి, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News May 7, 2024

ఖమ్మం: వడగండ్లు మిగిల్చిన కడగండ్లు

image

ఖమ్మం జిల్లాలో వడగండ్ల వాన రైతన్నలను ముంచేసింది. అకాల వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు వడగండ్ల దాటికి దెబ్బతిన్నాయి. ఐకేపీ కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

News May 7, 2024

KMM: ఈ ఎన్నిక‌ల‌లో ఒక్క సీటైనా గెలుస్తారా: భ‌ట్టి

image

ఖ‌మ్మం MPగా BRS త‌రుపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావు ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారు? అని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ‌లో ఒక్క సీట్ కూడా గెలవని BRS నుంచి నామా ఎలా మంత్రి అవుతారని KCRను నిల‌దీశారు. ఖ‌మ్మంలో ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల త‌ర్వాత BRSకు రాష్ట్రంలో అడ్రస్ ఉండదన్నారు. కార్ షెడ్ నుంచి ఇక బయటకు రాదని విమర్శించారు.

News May 7, 2024

ఖమ్మం: వడదెబ్బతో ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలోని కామంచికల్లు గ్రామానికి చెందిన సీపీఐ నాయకుడు గండ్ర లక్ష్మయ్య (75) వడదెబ్బతో మృతి చెందారు. పాల్వంచ రామవరం ఏరియాకు చెందిన ఈదులూరి కన్నయ్య (48) తాపీ మేస్త్రి పని చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. అలాగే పెద్ద గోపవరం గ్రామానికి చెందిన పశువుల కాపరి రాసమంటి వెంకటకృష్ణ (45) వడదెబ్బతో మృతి చెందాడు.