India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్లో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ సాగుతుంది. 4 హాల్స్ లో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉ.8 గంటల నుంచి బ్యాలెట్ పేపర్లను కట్టే ప్రక్రియను ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది ప్రారంభించారు. కాగా మద్యాహ్నం తరువాత మొదటి ప్రాధాన్యత ఓట్లను సిబ్బంది లెక్కించనున్నారు.
అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులో జనసేన ఫ్లెక్సీ చింపిన విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జనసేన ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ అభిమానులు చింపేశారని జనసేన అభిమానులు ఆరోపించారు. తోట శ్రీను అనే వ్యక్తి అడగడానికి వెళ్తే చితకబాదారని చెప్పారు. ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
కార్పొరేట్ కళాశాలల పథకం ద్వారా ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఒరిజినల్ ధృవపత్రాలను ఈ నెల 6న పరిశీలించనున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని సీజీజీ-ఈపాస్ నుండి మెసేజ్ వచ్చిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలతో ఈనెల 6న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు.
వరుస సెలవులు అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఈనెల 7 నుంచి పున:ప్రారంభమవుతుందని బుధవారం మార్కెట్ అధికారులు తెలిపారు. కావున ఈ విషయాన్ని రైతులందరూ గమనించి మార్కెట్లో క్రయవిక్రయాలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు.
ఖమ్మం ఎంపీ స్థానాన్ని 2014లో వైఎస్ఆర్‌సీపీ గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన పొంగులేటి గెలిచారు. 2019లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ మెజార్టీతో ఖమ్మంలో పాగా వేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లైంది.
నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందనీ, అలాగే రాత్రి 11 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలై .. చెల్లిన ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ఈసీ ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు చుక్కెదురైంది. ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు. మొత్తం 12,40,582 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి 2,99,082 ఓట్లు మాత్రమే సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 5,67,459 ఓట్లు పోల్ కాగా, పోలింగ్ శాతం 49.80గా నమోదైంది. ఈసారి కేవలం 24.10 శాతం ఓట్లే సాధించి ఓటమి చవిచూశారు.
ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను పరిశీలిస్తే ఖమ్మం అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఆయన 86,565 ఓట్ల మెజార్టీ సాధించగా, కొత్తగూడెంలో 76, 177 ఓట్లు, సత్తుపల్లిలో 69,408 ఓట్లు, మధిరలో 63,569, వైరాలో 61,778, పాలేరులో 61,681 ఓట్లు, అశ్వారావుపేటలో 42,927 ఓట్ల మెజార్టీ సాధించారు.
ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మొత్తం 1,18,636 ఓట్లు పొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 20,488 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో 1.80 శాతం పోల్ కాగా, ఈసారి ఓట్ల శాతం 9.55 శాతానికి పెరగడం విశేషం. తొలి నుంచి విస్తృతంగా ప్రచారం చేయడంతో బీజేపీ అభ్యర్థి వినోద్ రావుకు లక్ష ఓట్లకు పైగా పోలైనా ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు.
పొంగులేటి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో రెండు పోలింగ్ బూత్ లలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. నారాయణపురంలో 94వ బూత్‌లో బీజేపీకి 89 ఓట్ల మెజారిటీ వచ్చింది. అక్కడ మొత్తం 735 ఓట్లు పోలవగా బీజేపీ 404, కాంగ్రెస్ 315, బీఆర్ఎస్ 16 ఓట్లు సాధించింది. బూత్ నంబర్ 95లో 320 ఓట్లు పోలవగా బీజేపీ 197, కాంగ్రెస్ 112, బీఆర్ఎస్‌కు 11ఓట్లు లభించాయి. బీజేపీకి 85 ఓట్ల ఆధిక్యం దక్కింది.
Sorry, no posts matched your criteria.