Khammam

News June 5, 2024

ఖమ్మంలో నామా రికార్డు బ్రేక్

image

ఖమ్మంలో నామా పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. ఖమ్మంలో 17సార్లు ఎన్నికలు జరగ్గా 2019 ఎన్నికల్లో నామాకు 1,68,062 మెజార్టీ వచ్చింది. కాగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఆయన నామాపై 4,67,847 మెజార్టీతో గెలిపొందారు. నామాకు 2,99,082 ఓట్లు వచ్చాయి. కాగా ఖమ్మంలో ఈస్థాయిలో మెజార్టీ రావడం ఇదే తొలిసారి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి.

News June 5, 2024

నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. ఖమ్మంలో 6782 ఓట్లు పోలవగా.. మహబూబాబాద్‌లో 6585 ఓట్లు పోలయ్యాయి. కాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి రఘురాం రెడ్డి 61.29% ఓట్లతో సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు. నామా నాగేశ్వరరావుకు 23.9% ఓట్లు పోలయ్యాయి.

News June 4, 2024

గెలుపొందిన సర్టిఫికేట్ అందుకున్న రఘురాంరెడ్డి

image

ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన రామ‌సహాయం రఘురాంరెడ్డికి ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ సర్టిఫికేట్ అందజేశారు. తన గెలుపునకు సహకరించిన వారికి రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్ పాల్గొన్నారు.

News June 4, 2024

ఓడినా ప్రజల మధ్యే ఉంటా: నామా

image

తాను గెలిచినా.. ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటానని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు కన్న తల్లి ఎంత ఇష్టమో ఖమ్మం నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టమని చెప్పారు. గెలిస్తే పొంగిపోయేది లేదని ఓడితే కుంగేది లేదన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని పేర్కొన్నారు.

News June 4, 2024

ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: పొంగులేటి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడతూ.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేశారు. రఘురాంరెడ్డి గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News June 4, 2024

‘పథకాలే భారీ మెజారిటీతో గెలిపించాయి’

image

కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే తనను గెలిపించాయని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి తెలిపారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పార్లమెంట్ కౌంటింగ్ వద్ద ఆయన మాట్లాడారు. తన గెలుపునకు కృషి చేసిన మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

News June 4, 2024

ఆంధ్రాలో ఫలితాలు.. తెలంగాణలో టెన్షన్

image

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రం కావడంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల టెన్షన్ ఇక్కడ కూడా నెలకొంది. ఏలూరు జిల్లాకు సమీపంలోని అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో జోరుగా ఆంధ్ర ఫలితాలపై బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఫలితాల కోసం యువత టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి ఎదురుచూస్తున్నారు. ఫలితాల అనంతరం సంబరాల కోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు.

News June 4, 2024

ఎన్నికల కోడ్‌కు తెరపడితేనే.. పాలన పట్టాలెక్కేది ..!

image

ఉమ్మడి జిల్లాల్లోని 10 శాసనసభ నియోజకవర్గాలకు రూ.10కోట్ల చొప్పున మంజూరయ్యాయి. వీటిలో రూ.2కోట్లను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, రూ.కోటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిధులకు సంబంధించి పనులు అంచనాల దశలోనే ఉన్నాయి. ఎన్నికల సంఘం అనుమతితో తాగునీరు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి పనులు మాత్రమే కొనసాగుతున్నాయి.

News June 4, 2024

ఖమ్మం: 9 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితం

image

ఖమ్మం MP ఓట్ల లెక్కింపునకు పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో సర్వం సిద్ధమైంది. ఖమ్మం, పాలేరు, మధిర, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 115 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా ఒక్కో రౌండ్ కు కనీసం 30 నిమిషాల వ్యవధి పడుతుంది. ఈ లెక్క ప్రకారం 8.50 వరకు ఫలితం వెల్లడవుతుందని అధికారులు భావిస్తున్నారు.

News June 4, 2024

లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 144 సెక్షన్ అమలు: సీపీ

image

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా జూన్ 4న ఉ.6 గంటల నుండి జూన్ 5 ఉ.6 గంటల వరకు అంక్షలు విధించినట్లు తెలిపారు. గుంపులుగా, ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, నిషేధమని పేర్కొన్నారు