Khammam

News November 23, 2024

ఖమ్మం జిల్లాను కమ్మేసిన పొగమంచు

image

ఖమ్మం జిల్లాను శనివారం పొగమంచు కమ్మేసింది. జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఉదయాన్నే పనికి వెళ్లే రోజువారి కూలీలు ఎముకలు కొరికే చలిలో వెళ్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 8 గంటల తర్వాతే బయటకు వస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

News November 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం > భద్రాచలానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక > కొత్తగూడెం సింగరేణిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం > ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం > చుంచుపల్లిలో నూతన ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంప్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు > నేలకొండపల్లిలో చెరుకు రైతుల సంఘం రాష్ట్ర సదస్సు > పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News November 23, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఇవాళ,  ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.

News November 23, 2024

మధిరకు నలుగురు మంత్రుల రాక

image

మధిర శ్రీరస్తు పంక్షన్ హాల్ నందు ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు జరగనున్న “RAMP అవగాహన” కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శ్రీధర్ బాబు రానున్నారు. మధిర నియోజక వర్గంలోని 5 మండలాల నుండి 250 మంది మహిళా ఎంటర్ ప్రైజెస్ వారు హాజరౌతున్నారు. వీరికి స్కిల్ డెవలప్మెంట్, మహిళా శక్తి, MSMEపై అవగాహన కల్పించనున్నారు.

News November 23, 2024

ఖమ్మంలో నిరుద్యోగులను మోసం చేస్తున్న మహిళ అరెస్టు

image

ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న మహిళను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్న లీలాబాయి అనే మహిళను అరెస్టు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. లీలాబాయిను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.

News November 23, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఇవాళ,  ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కోరారు.

News November 23, 2024

ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి చర్యలు: జిల్లా కలెక్టర్

image

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి ట్రాన్స్ జెండర్‌లతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి చర్యలు చేపడతామని, ఆధార్ కార్డులు లేనివారికి ఆధార్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News November 22, 2024

రైతులకు బేడీలు వేసిన మీరు పరామర్శిస్తున్నారా: ఎంపీ రేణుక

image

ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర మరిచిపోయి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అన్నారు. ఈరోజు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కి వెళ్లి రైతులను పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉండి రైతులకు బేడీలు వేసిన సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు.

News November 22, 2024

కొత్తగూడెం: హమాలీ బిడ్డకు 3 గవర్నమెంట్ జాబ్స్ 

image

దమ్మపేటలో జీసీసీలో హమాలీగా పనిచేస్తున్న బోగి సత్యం, అంగన్వాడీ కార్యకర్త బోగి రమణ దంపతుల పెద్ద కుమార్తె సమ్మక్క 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం, గ్రూప్‌4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ సాధించి శభాష్ అనిపించుకుంది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సమ్మక్క తెలిపారు.

News November 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన
∆} కారేపల్లి మండలంలో ఎంపీ రేణుక చౌదరి పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు పర్యటన
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర సర్వే
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు