India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో అన్నదమ్ములను కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగింది. మృతులు ఊక అర్జున్, రమేశ్‌గా గుర్తించారు. రమేశ్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా, వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరిట మావోలు లేఖ వదిలారు.

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ముందుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పర్యటిస్తారని అనంతరం చింతకాని మండలంలో ప్రొద్దుటూరు గ్రామంలో పర్యటిస్తారని చెప్పారు. కావున బిఆర్ఎస్ శ్రేణులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.

ఈ నెల 24 తేదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు డిపోల నుంచి పంచరామాలు, అన్నవరం శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. సీట్ల బుకింగ్ కొరకు www.tgsrtcbus.in సంప్రదించాలని కోరారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో 17 డిగ్రీలు, భద్రాద్రి జిల్లాలో 16 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

☆ ఖమ్మం నగరంలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన
☆ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం, భద్రాద్రిలో నేడు ప్రత్యేక పూజలు
☆ మధిరలో నేడు విద్యార్ధులకు టాలెంట్ టెస్ట్
☆ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న కులగణన సర్వే
☆ అశ్వారావుపేటలో నేడు ఎమ్మెల్యే జారే పర్యటన
☆ ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
☆ పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు కలిపే లింక్ కెనాల్ పనులకు ఇటీవల జలవనరుల శాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈమేరకు గడువు 16వ తేదీతో ముగియగా 25వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ.191 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనులకు గత నెల 25న ఆన్‌లైన్లో టెండర్లు ఆహ్వానించగా ఈనెల 8వ తేదీ వరకే తొలుత గడువు విధించారు. ఆతర్వాత 16వ తేదీకి, ఇప్పుడు 25 వరకు పొడిగించారు.

డోర్నకల్ సమీపంలో ఓ గూడ్స్ రైల్ ఇంజిన్‌లో తలెత్తిన సమస్యను రైల్వే అధికారులు క్లియర్ చేశారు. దీంతో సుమారు రెండు గంటల పాటు డోర్నకల్ సమీపంలో ఆగిన ఇంటర్ సిటీ, కృష్ణ ఎక్స్ ప్రెస్ రైళ్లు ముందుకు కదిలాయి. రైళ్ల రాకపోకలకు మరింత ఆలస్యం అవుతుందని గుర్తించిన కొంతమంది ప్రయాణికులు ఆ రైళ్లు దిగి వేరే మార్గంలో వెళ్లిపోయారు. వారు వెళ్లిన కాసేపటికే రైళ్ల పునరుద్ధరణ ప్రారంభమైంది.

ఈ నెల 21న ఖమ్మంలో లగచర్ల రైతులకు సంఘీభావంగా ఏర్పాటుచేసిన ర్యాలీలో మండలం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాలలో సమగ్ర సర్వే 63% పూర్తి చేసినట్లు ఆర్డీఓ రాజేందర్ తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్లూరు, తల్లాడ, వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, ఏన్కూర్ మండలాలలో, 1,03,453 కుటుంబాలకు గానూ 64,483 కుటుంబాల సర్వే జరిగినట్లు ఆర్డీఓ వివరించారు. ఈనెల 24వ తేదీ వరకు దాదాపు సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు, కృషి చేస్తున్నట్లు ఆర్టీఓ అన్నారు.
Sorry, no posts matched your criteria.