India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రామస్థాయి నేతలు పంచాయతీ ఎన్నికల సమరం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జూన్లో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో పోటీకి ఆయా పార్టీల నేతలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఎన్నికలు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఎప్పుడు జరుగుతాయోనని ఆరా తీస్తున్నారు. గతంలో ఉన్న అభ్యర్థులతో పాటు కొత్త వారు కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని 1,070 జీపీలలో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల చర్చే ఉంది.
హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ దీక్ష విరమణకు భద్రాద్రికి విచ్చేసిన హనుమాన్ భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి రామాలయ ఈవో రమాదేవి తెలిపారు.
ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను ఆయన అడిగితెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
వడదెబ్బతో మహిళ మృతిచెందిన ఘటన మణుగూరులో చోటుచేసుకొంది. ప్రకాశం జిల్లాకి చెందిన సిద్ధ సీతాలక్ష్మి(61)తో పాటు మరో ముగ్గురు మినీ వ్యానులో భద్రాచలం సీతారామచంద్ర స్వామి, మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి తీర్థయాత్రలకు వెళ్లారు. అస్వస్థతకు గురైన సీతాలక్ష్మిని మణుగూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాలు తెలియాల్సి ఉంది.
లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. గత ఎన్నికల్లో ఓటర్లు ఖమ్మం (BRS), మహబూబాబాద్ (BRS)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి సెలవు
✓అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
రెండ్రోజులుగా భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ప్రభుత్వం రెడ్ జోన్ హెచ్చరికలను జారీచేసింది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా గ్రీన్ జోన్‌గా పరిగణిస్తారు. భద్రాద్రి జిల్లాలోని మండలాలన్నీ రెడ్ జోన్‌కు చేరువ అవుతుండగా జిల్లా ప్రజల్లో ఆందోళన రేకెత్తుతుంది.
ఈ నెల 7, 8 వ తేదిలలో హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అన్నారు. వివిధ దేశాల నుండి వరి శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సు నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల సంస్థ డైరెక్టర్ మెర్సిడెస్ జోన్స్, స్థానిక నిర్వాహుకులు ఈరోజు మంత్రి తుమ్మలను కలిశారు.
చెన్నై నుంచి ఎలాంటి పన్నులు చెల్లించకుండా తీసుకువస్తున్న బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కె. మహేశ్, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పి. వెంకటేశ్వరరావు ఇద్దరూ బావా బావమరుదులు. చెన్నై నుంచి 400 గ్రాముల బంగారం బిస్కెట్లను అనధికారికంగా తీసుకువస్తుండగా విజయవాడ వెస్ట్ బుకింగ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు అమెర్డ కాలనీకి చెందిన షేక్ ఖాద్రి (80)గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Sorry, no posts matched your criteria.