Khammam

News May 28, 2024

భద్రాద్రి: రూ.1.23 కోట్ల గంజాయి పట్టివేత

image

భద్రాద్రి జిల్లా పోలీసులు గంజాయిని భారీగా పట్టుకున్నారు. దీని విలువ రూ.1.23 కోట్లుగా లెక్కగట్టారు. సీఐ శివప్రసాద్ వివరాల ప్రకారం.. ఎస్సై పురుషోత్తం తన బృందంతో కలిసి స్థానిక పాత బస్‌డిపో వద్ద సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఓ డీసీఎం వ్యానును సోదా చేయగా క్యాబిన్ వెనుక అనుమానం రాకుండా నిర్మించిన బాడీ(అర) కనిపించింది. దాంట్లో 492 కిలోల గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. 4గురిపై కేసు నమోదు చేశారు.

News May 28, 2024

పాల్వంచ: ఉరి వేసుకుని ఆటో డ్రైవర్ సూసైడ్

image

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం పాల్వంచ మండలంలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. పాల్వంచ మండలం జగన్నాథపురానికి చెందిన మాలోత్ రాము(52), ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాము సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు

News May 28, 2024

KMM: ఓటేసేందుకు వస్తూ దంపతుల దుర్మరణం

image

భార్యతో ఓటు వేయించేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొని దంపతులిద్దరూ మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలోని చోటుచేసుకుంది. SI సైదా రవూఫ్ వివరాలు.. సంపత్‌నగర్‌కు చెందిన పాయం జానకి(35)తో ఓటు వేయించేందుకు భర్త కృష్ణయ్య(39) బైక్‌పై టేకులపల్లికి వెళ్తుండగా లాలుతండా సమీపంలో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిని వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. వీరికి కుమార్తె షణ్ముకప్రియ ఉన్నారు.

News May 28, 2024

ఖమ్మంలో 67.63%.. భద్రాద్రిలో 70.01%

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 2021లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 78.36 శాతం పోలింగ్ నమోదైతే నిన్న జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 67.63 శాతం, భద్రాద్రి జిల్లాలో 70.01 శాతం పోలీంగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,23,985 మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం వరకు 51,053 మంది పురుషులు, 33,752 మహిళలు, 2 ఇతరులు ఓటేశారు.

News May 28, 2024

గ్రూప్ 1 పరీక్షకు భద్రాద్రి జిల్లాలో 21 సెంటర్లు

image

రాష్ట్ర ప్రభుత్వం TSPSC ద్వారా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రవేశ పరీక్షకు జిల్లాలో 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. జూన్ 9న (ఆదివారం) ఉదయం 10:30 గంటల నుంచి 1:00 గంటల వరకు పరీక్షా ఉంటుందన్నారు. డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.

News May 27, 2024

ఖమ్మం: పార్లమెంట్ ఎన్నిక కౌంటింగ్‌పై టెలికాన్ఫరెన్స్

image

లోకసభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్, అధికారులు ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ గౌతమ్ వారికి వివరించారు.

News May 27, 2024

ఖమ్మం జిల్లాలో 65.54 శాతంగా పోలింగ్ నమోదు

image

ఖమ్మంలో పట్టభద్రుల ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 65.54 శాతంగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. నాలుగు గంటల సమయంలో కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే పట్టభద్రులు భారీసంఖ్యలో ఎన్నికలో పాల్గొన్నారు.

News May 27, 2024

ఖమ్మం: మధ్యాహ్నం 2 గంటల వరకు 49 శాతం ఓటింగ్

image

ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మద్యాహ్నం 2 గంటల వరకు 49 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరో రెండు గంటల సమయమే ఉన్న నేపథ్యంలో ఓటర్లు కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. ప్రస్తుత ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కొనసాగుతుంది.

News May 27, 2024

KMM: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.

News May 27, 2024

ఖమ్మం: 30.06% పోలింగ్ నమోదు

image

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీగా పోలింగ్ నమోదు అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 30.06 శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు భారీగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం కన్పిస్తుంది. ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులు ఓటు వేసేందుకు భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.