Khammam

News May 27, 2024

ఖమ్మం జిల్లాలో 13.01 శాతం పోలింగ్ నమోదు

image

నేడు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న శాసన మండలి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉదయం 10 గంటల వరకు 13. 01 శాతం పోలింగ్ నమోదయినట్లు సంబంధిత ఎన్నికల అధికారులు తెలియజేశారు. కాగా, జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి.

News May 27, 2024

నల్గొండలో MLC అభ్యర్థి అశోక్ ఆందోళన

image

నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని డోకూరు ఫంక్షన్ హాల్లో ఓ పార్టీ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే తనపై దాడి చేసి, మొబైల్ ధ్వంసం చేశారని PS ముందు భైఠాయించారు. అధికార పార్టీ నాయకులే ఈ పని చేశారని అశోక్‌ ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

ఖమ్మం: గ్రాడ్యుయేట్లు ఇలా ఓటెయ్యండి

image

☞ పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్‌లో1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి
☞మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి
☞ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు
☞ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫొటో ఎదురుగా ఉండే బాక్స్‌లో 1 నంబర్ వేయాలి. మిగతా అభ్యర్థులకు 2,3,4,5,6 నంబర్లు రాయాలి
☞1,2,3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు

News May 27, 2024

ఖమ్మం: విత్తన భాండాగారం.. రైతుల పాలిట కల్పవృక్షం

image

పంటల సాగుకు రైతులకు నాణ్యమైన విత్తనాలను వారికి అందిస్తూ.. రైతుల పాలిట కల్పవృక్షంగా నిలుస్తోంది రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం. 1993లో జిల్లాలో ఏపీ సీడ్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం టీఎస్ సీడ్స్ కార్యాలయంగా పిలుస్తున్నారు. ఏటా రూ.25 కోట్లకు పైగా విత్తన వ్యాపారం నిర్వహిస్తున్నారు.

News May 27, 2024

FLASH.. ఖమ్మం: ప్రారంభమైన పోలింగ్

image

వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు ఉమ్మడి జిల్లాలోని 605 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఎలక్షన్ అధికారులు సూచించారు.

News May 27, 2024

KMM: ప్రధాన అభ్యర్థులు ఓటేసేదిక్కడే..!

image

KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్‌రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్‌రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.

News May 27, 2024

పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు కీలకం: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్‌లో లెక్కింపు సిబ్బందికి ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై, లెక్కింపు సిబ్బందికి విధులపై అవగాహన కల్పించారు. జూన్ 4న జరిగే పార్లమెంట్ ఎన్నిక లెక్కింపు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

News May 26, 2024

ఖమ్మం: విద్యుదాఘాతంతో మాజీ ఎంపీపీ మృతి

image

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన మాజీ ఎంపీపీ రాములు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాములు తన ఇంట్లో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 26, 2024

ఎమ్మెల్సీ ఓటర్లు ఇలా వేస్తే ఓటు చెల్లదు: కలెక్టర్

image

రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నిబంధనల మేరకు ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రోమన్ అంకె లేదా సాధారణ అంకెల రూపంలోనే ఓటు వేయాలన్నారు. అలాకాకుండా ప్రాధాన్యత క్రమాన్నిమార్చివేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదన్నారు. ఓటు వేసే ముందు అక్కడ సిబ్బందిని ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు.

News May 26, 2024

భద్రాచలం ఆలయంలో మళ్లీ వివాదం..!

image

భద్రాచలం ఆలయంలో మరోసారి వివాదం మొదలైంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రవర మార్చి చదివారని అర్చకులకు, వేద పండితులపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అర్చకులకు, వేద పండితులకు ఈవో మెమోలు జారీ చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రవర పఠించే సమయంలో శ్రీరాముడిని అర్చకులు రామనారాయణుడు అని సంబోధిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.