Khammam

News May 24, 2024

కౌంటింగ్ సిబ్బంది నియామకం: కలెక్టర్ గౌతమ్

image

లోకసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాoడమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో ఆన్లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా ర్యాoడమైజేషన్ చేపట్టి పూర్తి చేశారు. కౌంటింగ్ కొరకు రిజర్వ్ తో కలిపి 148 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 173 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 150 మంది సూక్ష్మ పరిశీలకులు నియమించినట్లు చెప్పారు.

News May 24, 2024

భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత

image

భద్రాచలంలోని <<13306910>>మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత<<>> నెలకొంది. విద్యార్థిని కారుణ్య మృతి విషయం తెలుసుకున్న MLA తెల్లం వెంకట్రావ్ కాలేజీకి వచ్చి యజమాన్యంతో మాట్లాడారు. నిందితుల తరఫున వచ్చారా అని విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. కారుణ్య కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేందుకు MLA యత్నించినా వారు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

News May 24, 2024

ఖమ్మం: ప్రచార పర్వానికి రేపటితో తెర

image

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరందరూ శుక్రవారం వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ప్రచార పర్వానికి శనివారం సాయంత్రానికి తెరపడనుంది. సోమవారం ఉదయం 7నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రిలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News May 24, 2024

భద్రాచలం: మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఆందోళన

image

భద్రాచంలోని మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న కాలేజ్ ప్రాంగణలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య గాయాలతో పడి ఉండగా యాజమాన్యం ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కారుణ్య నిన్న సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో ప్రభుత్వాస్పత్రి నుంచి ర్యాలీగా కాలేజ్ వద్దకు చేరుకున్న విద్యార్థులు, బంధువులు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

News May 24, 2024

మణుగూరు నుంచి కోల్ కారిడార్

image

బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న కోల్ కారిడర్ మణుగూరు నుంచి ప్రారంభం కానుంది. తాజాగా మణుగూరు – రామగుండం వరకు రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చ జండా ఊపింది. ఇందుకుగాను రూ. 2,911 కోట్లు ఖర్చు చేయనుంది. మణుగూరులో ప్రారంభమయ్యే ఈ రైలు ఏటూరు నాగారం మీదుగా ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భూపాలపల్లి నుంచి మంథని మీదుగా రామగుండం పరిధిలోని రాఘవాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

News May 24, 2024

KMM: రోడ్డు ప్రమాదంలో రికార్ట్ అసిస్టెంట్ దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ దుర్మరణం చెందిన ఘటన గురువారం రాత్రి సత్తుపల్లిలో చోటుచేసుకుంది. JVR ప్రభుత్వ కాలేజ్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేసే ప్రసాద్(38) స్థానిక కృషి బైపాస్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన ద్విచక్రవాహనంపై రాజీవ్‌నగర్ నుంచి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్‌కు ఉన్న కల్టివేటర్‌ను ఢీకొన్నాడు. పేగులు బయట పడటంతో స్థానికులు వెంటనే స్థానిక CHCకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

News May 24, 2024

అభయారణ్యంలో అలరిస్తున్న జింకలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలోని అభయారణ్యంలో 140 జింకలు పర్యాటకులను అలరిస్తున్నాయి. 1974లో 8 జింకలతో ఈ అరణ్యం మొదలైంది. ప్రస్తుతం జింకల సంతతి 140కి చేరింది. గతంలో సింగరేణి సంస్థ వీటి బాధ్యతను చూసేది. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో అభయారణ్యం కొనసాగుతోందని రేంజర్ శ్రీనివాస్ తెలిపారు.

News May 24, 2024

KMM: ప్రయాణికులపై ట్రాన్స్‌జెండర్ల దాడి

image

ఒడిశా వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. జనరల్ బోగిలో ఎక్కిన వారు ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బలరాం వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో అతడితో పాటు మరికొందరిపై దాడి చేశారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగగా, సదరు యువకులు ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 24, 2024

KMM: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు జిల్లాలో 42కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 14,984 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10,352మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,632 ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఉదయం 9నుంచి మధ్యహ్నం 12గంటల వరకు సెకండ్ ఇయర్ మధ్యహ్నం 2:30 నుంచి 5:30వరకు నిర్వహిస్తారు. జూన్1న పరీక్షలు ముగియనున్నాయి.

News May 24, 2024

ఖమ్మం: రైస్ మిల్లును తనీఖీ చేసిన కలెక్టర్

image

సిఎంఆర్ రైస్ దిగుమతి లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచల శివ రైస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ తనిఖీలు చేశారు. మిల్లు సామర్థ్యం, రోజుకు ఎంత మేర ధాన్యం పట్టేది, ఎంత ధాన్యం నిల్వ ఉన్నవి, హమాలీలు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ లో వచ్చే పంటపై వివరాలు సేకరించారు.