India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారామెడికల్ విద్యార్థిని మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం డిప్యూటీ తహశీల్దార్ భరణిబాబు ఏసీబీకి చిక్కాడు. పాసుపుస్తకం ఇచ్చేందుకు ఓ రైతును లంచం అడిగాడు. రైతు ఏసీబీకి సమాచారం అందించగా రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆస్తి కోసం కన్న కూతురే తండ్రిని చంపిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. గోరిలపాడుతండాకు చెందిన తేజవత్ బిచ్చు(60)కు కూతురు సక్కుకు ఆస్తి పంపకాల నేపథ్యంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో సక్కు, మనుమరాలు నగ్మ కలిసి అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు కొత్తగా ముగ్గురు ఏఎంవీఐ (అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్)లను కేటాయిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో స్వర్ణలతను ఖమ్మంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి, కల్లూరు చెక్ పోస్ట్‌కు సాయిచరణ్, విజయశాంతిని కేటాయించగా గురువారం వారు విధుల్లో చేరారు. అయితే, వీరి కేటాయింపు తాత్కాలికమేనని ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం నియమించిందని రవాణా శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంతకాలంగా మూడో లైన్ నిర్మాణ పనులతో నిలిచిపోయిన రైళ్లు గురువారం నుంచి యథావిధిగా నడుస్తాయని ఖమ్మం రైల్వే కమర్షియల్ అధికారి ఎండీ. జాఫర్ తెలిపారు. ఖమ్మం మీదుగా వచ్చివెళ్లే శాతవాహన, గోల్కొండ, కృష్ణ, ఇంటర్ సిటీ, మచిలీపట్నం, గౌతమి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిర్ణీత సమయంలో రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.
రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.
ప్రేమించి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఖమ్మం రూరల్ మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకుడు ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కొద్ది రోజుల క్రితం నిలదీయగా, అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి రోహిణి కార్తీ రానుంది. ఈ నేపథ్యంలో కార్తి వచ్చిన వెంటనే పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసి ఉంచారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులు పెద్ద ఎత్తున మెట్ట పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. బుధవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జీలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
పత్తి విత్తనాలపై ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖతో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గతంలో అనేకసార్లు జిల్లాలో రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోయి దిగుబడి రాక నష్టాల పాలైన ఘటనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుత సీజన్లో నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విత్తనాల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నారు.
Sorry, no posts matched your criteria.