Khammam

News May 23, 2024

ఖమ్మం: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: సీపీ

image

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. నకిలీలను అరికట్టేందుకు 21 టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయొద్దన్నారు. అక్రమ‌రవాణను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ లను ఉంచామని పేర్కొన్నారు. తరుచూ నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు చేస్తామన్నారు.

News May 22, 2024

KMM: మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం

image

NLG -KMM-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని BRS, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించాలని BJP భావిస్తోంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరఫున కీలక నేతలను రంగంలోకి దింపారు.

News May 22, 2024

KTDM: కారు డోరు లాక్.. ఊపిరాడక చిన్నారి మృతి

image

కారులో ఆడుకుంటూ చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం కొండయిగూడెంకి చెందిన చిన్నారి కల్నిషా (3) ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులోకి వెళ్లింది.డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయి ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 22, 2024

తీన్మార్ మల్లన్నను పోటీ నుంచి తప్పించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన

image

పట్టభద్రులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పోటీ నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని MLC స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా తీన్మార్ మల్లన్న శాసన మండలికి పంపుతారా.. లేకుంటే శ్మశానానికి పంపుతారా అని బ్లాక్‌మెయిల్ చేశాడన్నారు.

News May 22, 2024

ఖమ్మం: మార్ఫింగ్ పోటోలతో యువతికి వేధింపులు

image

ఇన్‌స్టాలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారంటూ ఓ డిగ్రీ విద్యార్థిని సీపీ సునీత్ దత్‌కు ఫిర్యాదు చేసింది. గతంలోనూ చాలా సార్లు వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.  ఇన్‌స్టాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరింది. 

News May 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} మణుగూరు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన

News May 22, 2024

కొత్తగూడెం: రోడ్డుప్రమాదాల్లో ముగ్గురి మృతి

image

వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనలు కొత్తగూడెం జిల్లాలో జరిగాయి. దమ్మపేట పట్వారిగూడెం కూడలి వద్ద లారీ, బైక్‌ను ఢీకొట్టడంతో కుంజా నాగేంద్రబాబు, సోయం నాగేంద్రబాబు అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కొన్ని గంటలకు ముందు పట్వారిగూడెంలో బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో పదహారేళ్ల బాలుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

News May 22, 2024

ఖమ్మం: రాష్ట్రస్థాయిలో మొదటి, మూడో ర్యాంకులు

image

కూసుమంచి మండలంలోని చేగొమ్మకు చెందిన రెడ్డిమల్ల యమున తెలంగాణ ఈసెట్‌లో ‘ఎలక్ట్రికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌’ విభాగంలో రాష్ట్రంలో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. పదో తరగతి వరకు చేగొమ్మలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనే చదువుకుంది. కోక్యాతండాకు చెందిన తేజావత్‌ లక్ష్మణ్‌(ప్రభుత్వ టీచర్) – కవిత దంపతుల కుమారుడు సాత్విక్‌ సోమవారం వెలువడిన ఈసెట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనరల్‌ కేటగిరీలో మూడోర్యాంకు సాధించాడు.

News May 22, 2024

నిధిమ్ లో అడ్మిషన్లు ప్రారంభం: కలెక్టర్ ప్రియాంక

image

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిధిమ్) ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. 

News May 21, 2024

కేయూ ఇన్‌‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

image

కాకతీయ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ప్రముఖ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. కేయూలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఉన్న వీసీ తాటికొండ రమేశ్‌పై ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే.