Khammam

News October 30, 2024

మధిర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రీ కూతురు మృతి

image

మధిర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. విజయవాడలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు దిగి వస్తుండగా, మధిర మండలం మల్లారానికి చెందిన కొంగర కేశవరావు, ఖమ్మంపాడుకు చెందిన కూతురు నూకారపు సరితపై చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 30, 2024

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి పంచరామాలు, అన్నవరం, శబరిమలై, అరుణాచలంకి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. బస్సుల బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్సైట్‌ను సందర్శించవలసిందిగా కోరారు.

News October 30, 2024

కొత్తగూడెం: ‘ఎద్దుపై పులి దాడి ‘

image

కూనవరం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ బొదునూరులో ఎద్దుపై పులి దాడి చేసిందని రైతు సోడి శ్రీను తెలిపారు. పులి దాడిలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిందని అన్నారు. కాగా ఎద్దుపై పులి దాడి చేయడంతో బొదునూరు గ్రామానికి చెందిన ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గ్రామ ప్రజలు పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందించారు.

News October 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేటి పర్యటన వాయిదా > ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన > ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని దీక్ష > అశ్వరావుపేటలో గాలికుంటు నివారణ టీకాలు పంపిణీ > కొత్తగూడెంలో నేటితో ముగియనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు > పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన > బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

News October 30, 2024

మధిర: ‘త్రాగునీటి పైప్ లైన్ పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయాలి’

image

వరదల కారణంగా దెబ్బతిన్న కట్టలేరు మిషన్ భగీరథ పైప్ లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మార్వో ఆఫీసులో త్రాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కట్టలేరు మిషన్ భగీరథ పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తయ్యే విధంగా కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు.

News October 29, 2024

పాల్వంచ: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం పాల్వంచ మండలంలో చోటు చేసుకుంది. గంగాదేవిగుప్ప గ్రామానికి చెందిన వివాహిత స్వప్న(28) కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వప్న మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 29, 2024

ఖమ్మం: అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమక్షంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పి.శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. కాగా నూతన అదనపు కలెక్టర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News October 29, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 31న దీపావళి, నవంబర్ 1న అమావాస్య, నవంబర్ 2,3 తేదీల్లో వారంతపు సెలవులు కారణంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి నవంబర్ 4వ తేదీ నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News October 29, 2024

కుల గణనలో తెలంగాణ ఒక మోడల్: భట్టి

image

ఖమ్మం: రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయ వాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సందేశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కుల గణన చేస్తామని హామీ ఇచ్చామని ఇప్పుడు హామీని అమలు చేస్తున్నామన్నారు.

News October 29, 2024

ATC కోర్సుల అడ్మిషన్లకు రేపే చివరి గడువు

image

ఖమ్మం జిల్లాలోని ఐటిఐలలో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సుల ప్రవేశాల కొరకు బుధవారం చివరి గడువు అని అదనపు కలెక్టర్ శ్రీజ ఓ ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులలో చేరడానికి అడ్మిషన్ కోసం ttps://iti.telangana.gov.in ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.