India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం చెన్నారంకి చెందిన ఆవుల లచ్చాది తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం ప్రమాదంలోఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లచ్చాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

ఖమ్మం: చిట్టి నాయుడు చిల్లర డ్రామాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆశపడి ప్రజలు మోసపోయారని సోమవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన చెప్పారు. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడం చేతకాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని విమర్శించారు.

భద్రాద్రి రామాలయంలో లడ్డు ప్రసాదంలో వినియోగించే వస్తువుల సముదాయాన్ని ఇటీవల ఫుడ్ లాబరేటరీ అధికారులు తనిఖీ చేసే శాంపిళ్లను సేకరించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ప్రసాదం తనిఖీ నివేదిక వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. పప్పు, దినుసులు, బియ్యం, నెయ్యి అన్నీ నాణ్యమైనవిగా ఉన్నట్లు నివేదికలో వచ్చినట్లు ఈవో చెప్పారు.

పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న TGSP సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని సస్పెండ్ చేసిన అధికారులు వారిలో 10 మందిని డిస్మిస్ చేశారు. ఆరో బెటాలియన్ కొత్తగూడెంకు చెందిన కానిస్టేబుల్ భూషణ్ రావు అందులో ఉన్నారు. ఈ మేరకు ఏడీజీ సంజయ్ ఉత్తర్వులిచ్చారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ కానిస్టేబుళ్లు, వారి భార్యలు ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

ఖమ్మం: బొకేలు, శాలువాలు వద్దని, కరచాలనమే ముద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చే అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరూ అవేమి లేకుండానే రావాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోనూ హంగు ఆర్భాట కార్యక్రమాలను తగ్గించుకుని, పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, పేద ప్రజలకు వస్త్రాల పంపిణీ చేయాలనీ పేర్కొన్నారు.

మధిరలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఐటీఐలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఐవోటీ స్మార్ట్ అగ్రికల్చర్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ వంటి ఐదు ట్రేడ్లలో 200 సీట్లతో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. నిర్మాణం కోసం రూ.11.37 కోట్లు కేటాయించింది. మొత్తం 21 ఉద్యోగాలు మంజూరయ్యాయి.

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు నేడు ఉదయం పలు ప్రారంభోత్సవాలకు డిప్యూటీ సీఎం రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బస్ స్టాప్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఫీడింగ్ రూమ్, బ్యాంకు, భోజనశాలను పరిశీలించారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త రాజధాని ఏసీ నాన్ స్టాప్ బస్సులను ఈ నెల 28 నుంచి నడుపుతున్నట్లు ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు. అడ్వాన్స్ – టికెట్ల కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్‌లో బుకింగ్ చేసుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.