India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో యాచకుడిని వ్యాపారి మోసం చేసిన విచిత్రమైన ఘటన జరిగింది. సాయిబాబా గుడి వద్ద యాచన చేసే అశోక్ తన సొమ్ము రూ.50వేలను స్థానిక వ్యాపారి నరసింహారావుకు అప్పుగా ఇచ్చాడు. ఆ వ్యాపారి ఐపీ పెట్టి మోసం చేశాడు. ఈ ఘటనతో పాటు 85 మందిని నరసింహారావు మోసం చేసినట్లు సమాచారం. కాగా కూతురి భవిష్యత్ కోసం డబ్బు దాచుకున్నట్లు యాచకుడు వాపోయాడు.

నేటి నుంచి పాపికొండల యాత్ర ప్రారంభమవుతుంది. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకూ.. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకూ ఈ యాత్ర సాగనుంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం నిలకడగా ఉండటంతో 4 నెలల తర్వాత పాపికొండల యాత్ర ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకోసం టూరిజంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి టూరిజం బోట్లు బయల్దేరనున్నాయి.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పోలీసులు నరేశ్ అనే అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్నారు. అతణ్ని విచారించగా చాలా చోట్ల చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అతనిపై 15 కేసులు ఉన్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు. నరేశ్‌ది భద్రాద్రి జిల్లా జూలూరుపాడులోని ఎస్సీ కాలనీగా గుర్తించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 16 డిగ్రీలకు చేరింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్లగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఖమ్మం కమిషనరేట్లో అందుబాటులోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు MHBB, సూర్యాపేట జిల్లాలకు అందుబాటులో వుండే విధంగా జూబ్లీపురా, SBI బ్యాంక్ ఎదురుగా వున్న ప్రభుత్వ భవనంలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ 4 జిల్లాలకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

ఖమ్మం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, కులగణనను తెలంగాణ నుంచే ప్రారంభిస్తామన్న హామీని అమలులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేసీ వేణుగోపాల్ కి భట్టి వివరించారు.

ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెదడు, వెన్నెముక, నరాల చికిత్సకు రెండు రోజుల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఈ వైద్య శిబరంలో 87 మందికి చికిత్స అందించి, మందులు పంపిణీ చేసినట్లు హాస్పిటల్ జనరల్ మేనేజర్ భీమిరెడ్డి తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

1) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గవర్నర్ పర్యటన2) అధికారం ఎవరికి శాశ్వతం కాదు: BRS ఎమ్మెల్సీ మధు3) ఖమ్మం కమిషనరేట్లో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ: సీపీ 5) భద్రాది స్వామి వారని దర్శించుకున్న MLC కోదండరాం6) బెదిరింపులతో మా పార్టీ కార్యకర్తలను లొంగదీసుకోలేరు: MPవద్దిరాజు7) KUDA ఏర్పాటు చేస్తూ జీవో జారీ

ఖమ్మంలో 2 వంతెనల పైనుంచి వాహనాలు వెళ్తుండటంతో ట్రాఫిక్ జామ్ సమస్యలతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో భారీవాహనాలు వెళ్లేందుకు కరుణగిరి వంతెన, చిన్న వాహనాలకు నిజాం కాలం నాటి వంతెన ఉంది. మరో ప్రకాష్ నగర్ వంతెన మరమ్మతులకు గురైంది. దీంతో పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా జిల్లా మంత్రులు చొరవ తీసుకుని మున్నేరుపై మరో 2 వంతెనలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్..!

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరు గూడెం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళుతున్న పాండురంగాచారి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది అడసర్ల పాడుగా గుర్తించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాండురంగాచారి మర్లపాడు ఫౌండ్రిలో పనిచేస్తున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు.
Sorry, no posts matched your criteria.