India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉదయం 8గంటలకు భద్రాచలం ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 9గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో అధికారులతో భేటీ కానున్నారు. 10 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో కళాకారులు, రచయిత లతో సమావేశం అవుతారు. 11గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1గంట వరకు ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 2గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు పయనం అవుతారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలి తీవ్రరూపం దాల్చుతోంది. భద్రాద్రి జిల్లాలో గురువారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 16 డిగ్రీలకు చేరింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్లగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

మైనర్ కుమార్తెను వ్యభిచార కూపంలోకి దింపి బలవంతంగా బంధించి చిత్రహింసలు పెట్టిన తల్లికి జీవిత ఖైదుతో పాటు కోర్టు జరిమానా విధించింది. హయత్‌నగర్ పోలీసుల వివరాలు.. ఖమ్మంకు చెందిన బోడిగడ్డ సంధ్య(35) 2022లో కూతురిని వ్యభిచార కూపంలోకి దింపడంతో ఆమెపై కూతురు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

ఖమ్మం కార్పొరేషన్‌లో కొత్తగా ఒక్క అక్రమ నిర్మాణం జరిగినా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించాలని గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సరఫరా బిల్లులను ఎప్పటికప్పుడు వసూలు చేయాలని, త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.

ఈ నెల 29న ఉదయం 11:00 నుంచి 12:00 గంటల వరకు డయల్ యువర్ RM కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులకు సంబంధించిన సలహాలు, సూచనలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి పైన తెలిపిన సమయంలో 9959225953 నంబర్ కు డయల్ చేయాలన్నారు.

ఖమ్మం: అక్టోబర్ 20న ఢిల్లీలో జరిగిన వేదాంత హాఫ్ మారథాన్ రన్ లో కానిస్టేబుల్ పిల్లి రాజు పాల్గొని పతకం సాధించారు. గురువారం కానిస్టేబుల్ రాజును సీపీ సునీల్ దత్ అభినందించారు. కాగా మొత్తం 36,000 మంది పాల్గొన్న హాఫ్ మారథాన్ రన్ లో కానిస్టేబుల్ పిల్లి రాజు 01:53 నిమిషాలలో పూర్తి చేసి మెడల్ సాధించారు. మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకోని రావాలని సీపీ పేర్కొన్నారు.

కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామం వద్ద టిప్పర్ లారీ. బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని జుజులరావుపేట గ్రామానికి చెందిన ఐతం అనిల్(32)గా గుర్తించారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఓ శుభకార్యానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. మృతుడికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం వాయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. AICC కార్యదర్శి రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై రాహుల్ గాంధీతో డిప్యూటీ సీఎం మాట్లాడారు.

ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నికల్, డిప్లొమా ఇన్ మెడికల్ టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు సంవత్సరాల కోర్సుకు గాను బైపిసి విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత, ఎంపీసీ విద్యార్థులకు తదుపరి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రేపు అశ్వారావుపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ వట్టి వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని చెప్పారు. కావున సంబంధిత అధికారులు లబ్ధిదారులు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.