Khammam

News May 17, 2024

మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

image

టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బుగ్గపాడులో త్వరలోనే పరిశ్రమల స్థాపన, వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఖమ్మం మార్కెట్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

News May 17, 2024

KMM: మల్లన్నను తప్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత ధర్నా

image

ఖమ్మం: స్మశానానికి పంపుతారా-శాసన మండలికి పంపుతారా అని 4.61 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిన తీన్మార్ మల్లన్నను ఎన్నికల బరి నుంచి తొలగించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు.

News May 17, 2024

ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా అకాల వర్షానికి చాలా చోట్ల వడ్లు తడిసి పోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈదురుగాలుల ప్రభావానికి కొన్ని ప్రాంతాలల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. గాలి వానకు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు కరెంట్ స్తంభాలపై పడగా. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

News May 17, 2024

ఖమ్మం: పట్టభద్రులూ.. సరిగా ఓటేయండి

image

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

News May 17, 2024

కొత్తగూడెం: యువతిపై అత్యాచార యత్నం 

image

సుజాతనగర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిపై ఈనెల 12న రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు కథనం ప్రకారం.. ఇంట్లో ఉన్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. కులం పేరుతో దూషించాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై జుబేదా బేగం తెలిపారు.

News May 17, 2024

సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

News May 17, 2024

భద్రాద్రి రామయ్య నిత్యా కళ్యాణం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములవారి నిత్య కల్యాణ క్రతువును వీక్షించిన భక్తులు పరమానంద భరితులయ్యారు. రామయ్యకు అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. వైదిక పెద్దలు చేసిన ప్రవచనం ఆకట్టుకుంది. నిత్య కల్యాణం గురించి ప్రవచిస్తుండగా అనుగుణంగా వేడుకను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగల్యధారణ నిర్వహించి తలంబ్రాల వేడుక చేశారు.

News May 17, 2024

స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల పరిసరాలను నిరంతరం పర్యవేక్షించాలని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గౌతమ్ ఆదేశించారు. పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు శ్రీచైతన్య కళాశాలలోనే ఉంటుందని, అందుకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచినట్లు వివరించారు.

News May 17, 2024

ఖమ్మం: పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం!

image

ఖమ్మం జిల్లాలో మొత్తం 1,103 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడటంతో గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు.

News May 17, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓కొత్తగూడెంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం
✓వైరాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
✓పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన