Khammam

News April 25, 2024

ఖమ్మం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముదిగొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వాకదాని వైశాలి(17) ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

News April 25, 2024

బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా కామేశ్ నామినేషన్

image

ఖమ్మం బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా కొత్తగూడెం పట్టణానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్ కు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామేష్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో 90% పైగా ఉన్న బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తుందన్నారు. అన్ని పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్ ఇస్తుందని, బీఎస్పీ మాత్రమే జనరల్ స్థానాల్లో బీసీ ఎస్సీలకు ఇస్తుందన్నారు.

News April 25, 2024

నామినేషన్ దాఖలు చేసిన పోట్ల నాగేశ్వరరావు

image

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బుధవారం పోట్ల నాగేశ్వరరావు రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతంకు 3 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు నర్సిరెడ్డి, కొత్తగూడెం యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News April 25, 2024

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రాయల నామినేషన్

image

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను రాయల తరఫున కాంగ్రెస్ నాయకులు రిటర్నింగ్ అధికారికి అందించారు. కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు పాల్గొన్నారు.

News April 25, 2024

సెకండియర్ ఫలితాల్లో ఐదో స్థానంలో ఖమ్మం

image

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా 74.2 శాతంతో రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. 14,564 మందికి 10,806 మంది పాసయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 69.73 శాతంతో 9వ స్థానంలో నిలిచింది. 7,350 మందికి 5,125 మంది పాసయ్యారు.

News April 25, 2024

ఫస్టియర్ ఫలితాల్లో ఖమ్మం నాలుగో స్థానం

image

ఇంటర్ ఫస్టీయర్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 63.84 శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. 16,015 మందికి 10,224 మంది పాసయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 56.39 శాతంతో 15వ స్థానంలో నిలిచింది. 7,771 మందికి 4,382 మంది పాసయ్యారు.

News April 25, 2024

నేడే ఇంటర్ ఫలితాలు.. ఉమ్మడి ఖమ్మం నుంచి ఎంత మంది అంటే

image

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 36,578 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 19,477 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 25, 2024

BRS ఎంపీ అభ్యర్థి కవితపై రెండు కేసులు

image

మహబూబాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితపై రెండు పోలీస్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆమె భర్త బద్రు నాయక్, కుమార్తె మహతి, కుమారుడు నయన్ ఆస్తులు విలువ అంతా కలిపి రూ.3,97,72,259 ఉంటుందని చూపించారు. రెండు వాహనాలకు రూ.39,30,000, బంగారం 115 తులాలకు గాను విలువ రూ.76,13,000 ఉన్నట్లు వివరించారు. అప్పులు రూ.10,05,024 ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.

News April 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} వివిధ శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం
∆} ఖమ్మం నగరంలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} కల్లూరు మండలంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
..

News April 25, 2024

ఖమ్మం: భర్త కళ్ల ముందే భార్య మృతి

image

కొత్తగూడెం జిల్లా చర్ల(M) గొంపెల్లికి చెందిన లక్ష్మణరావు, సత్యవతి దంపతులు. సోమవారం వెంకటాపురం(M) వీఆర్‌కేపురం వెళ్లారు. మంగళవారం వరసకు అల్లుడైన గణేశ్‌తో బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జెల్లాకాలనీ వద్ద వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సత్యవతికి గాయపడగా ఆసుపత్రికి తరలించగా ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.