Khammam

News May 16, 2024

ఖమ్మం: గ్రూప్-1, సివిల్స్ గ్రాండ్ టెస్టులు

image

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1, సివిల్స్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షలపై అవగాహన పెంపొందించేలా ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. గ్రూప్-1 నమూనా పరీక్షలు 18, 20, 22, 24, 25, 27, 29, 31, జూన్ 1, 3 తేదీల్లో జరుగుతాయని వెల్లడించారు. అలాగే సివిల్స్ ఈనెల 23, 24, 27, 29, 31, జూన్ 1, మూడు తేదీల్లో జరుగుతాయన్నారు.

News May 16, 2024

సింగరేణి ఉద్యోగాలకు అప్లికేషన్స్ స్వీకరణ

image

సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్‌ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.

News May 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన

News May 16, 2024

నల్గొండ- ఖమ్మం- వరంగల్‌పై గురి

image

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు KMM-NLG-WGL ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై దృష్టి సారించాయి. ఎట్టి పరిస్థతుల్లోనూ ఈస్థానంలో పాగా వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. BRS నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉండగా ఆయనకు మద్దతుగా గతంలో ఈస్థానం నుంచి గెలిచిన పల్లా వ్యూహాలను రచిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డినే బీజేపీ ఈ దఫా బరిలోకి దింపింది.

News May 16, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ బరిలో 52 మంది

image

WGL-KMM-NLG పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ హరి చందన తెలిపారు. ఈ ఉపఎన్నిక నియోజకవర్గ పరిధి 12 జిల్లాలలో ఉందని, 12 మంది అదనపు కలెక్టర్లు ఏఆర్ఓలుగా ఉన్నారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టుకోవచ్చని, దానికి సంబంధించిన అనుమతులు జిల్లా స్థాయి ఏఆర్వోల వద్ద అనుమతి తీసుకోవాలన్నారు.

News May 15, 2024

సరికొత్త పంథాకు మంత్రి పొంగులేటి శ్రీకారం 

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయానికి బాధితులు వచ్చే అవసరం లేకుండా నియోజకవర్గ ప్రజలతో నేరుగా ఆయనే మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. తొలివిడత ఈనెల 17 నుంచి 20వ వరకు నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోని ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు.

News May 15, 2024

ఖమ్మం: 2007 నుంచి కారు పార్టీదే గెలుపు

image

NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.

News May 15, 2024

ఖమ్మం: చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు దుర్మరణం

image

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బోనకల్ మండలం ముష్టికుంట్ల- బోనకల్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కారు చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కారు మంటల్లో కాలిపోయింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

News May 15, 2024

ఖమ్మం స్థానంలో ఎవరి అంచనాలు వారివే!

image

ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తమ ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారని దేశంలోనే అధిక మెజార్టీ వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

News May 15, 2024

శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల ఆదాయం కన్నా ఖర్చు అధికం

image

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగిన శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల లెక్కలను అధికారులు ఎట్టకేలకు తేల్చారు. ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు రూ. 2,37,30,121 ఖర్చు చేయగా, అన్ని మార్గాల ద్వారా రూ.1,89,61,124 ఆదాయం సమకూరింది. సెక్టార్ల ద్వారా సుమారు రూ.93 లక్షలు, పరోక్ష సేవల ద్వారా రూ.7 లక్షలు, పోస్టల్ ద్వారా అంతరాలయ సేవలకు రూ.90 వేలు వచ్చాయి.