India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో గ్రూప్స్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ డా.మహేందర్ రెడ్డి, గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. త్వరలో మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జిలతో నేనంటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

కులగణన తర్వాత స్థానిక ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీల నేతలు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్టీపరంగా సానుభూతిపరులు ఎవరు? తమకు ఎవరు మద్దతిస్తారు..? తటస్థులు ఎంత మంది? అని విచారిస్తున్నారు. కుల సంఘాలను సంప్రదించడం ద్వారా ఎన్ని ఓట్లను రాబట్టుకోగలం..? అన్న లెక్కల్లో పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,070 జీపీలు ఉన్నాయి.

గురుకులాలకు సొంతభవనాలు ప్రభుత్వమే నిర్మించాలని, సరుకులు సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల గురుకుల భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో యజమానులు హాస్టళ్లకు తాళాలు వేసి మూసి వేశారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర నష్టమని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే భవనాలను తెరిపించి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మంలో జాబ్ మేళ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే సాంబశివరావు పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

కొత్తగూడెం: ఫ్లాగ్ డేను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం పోటీలను రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవలి కాలంలో తీసిన (3) ఫోటోలు, తక్కువ నిడివి (3ని.) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి అప్లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను జిల్లా పోలీస్ పిఆర్వోకు అందజేయాలన్నారు.

☆ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: జిల్లా ఎస్పీ☆ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన BJP ఎంపీ ఈటెల☆ కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల తనయుడు☆ కుటీర పరిశ్రమతో ఉపాధి కల్పించడం సంతోషకరం: ITDA PO☆ జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి, కొమరం బీమ్ వర్ధంతి కార్యక్రమం☆ ఖమ్మం మున్నేరు పాత వంతెన పై రాకపోకలు దారి మళ్లింపు☆ బయ్యారంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఇటు తెలంగాణ, అటు ఏపీకి సరిహద్దుగా ఉంది. ఇరు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను మధిర ప్రజలు పాటించడం ఇక్కడ ప్రత్యేకత. ఇలాంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 దఫాలుగా ఇక్కడ భట్టి గెలుపొందగా రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధిపై భట్టి మార్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో కొనసాగుతున్న గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం

వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాకు రూ.105 కోట్లను కేటాయించారు. ఇందులో ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాలకు రూ.25కోట్లు, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు రూ.15కోట్ల చొప్పున కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు. రఘునాథపాలెం మండలంలో 11చోట్ల 24.15 కిమీ రోడ్ల నిర్మాణంతో పాటు ఒక బ్రిడ్జి నిర్మాణానికి రూ.25కోట్లు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.