India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
న్యూడెమోక్రసీ దళ సభ్యుడిగా పనిచేసి 35 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు 50 ఏళ్ల వయస్సులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందు మండలం కొమరారంలో సోమవారం ఆయన ఓటు వేశారు. చిన్నతనంలోనే అజ్ఞాత దళ సభ్యుడిగా చేరిన మధు కమాండర్ స్థాయికి ఎదిగారు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా అరెస్ట్ అయిన ఆయన బెయిల్ పై బయటకు వచ్చినా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.
తిరుమలయపాలెం మండలం మేడిదపల్లిలోని పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి వివరించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.
ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బండారు నాగరాజు (యువతరం పార్టీ) స్వతంత్ర అభ్యర్థులు పోతుల ప్రార్థన, పోతుల యాదగిరి, సోమగాని నరేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారు నాగరాజు, దైద సోమ సుందరం, రత్నం ప్రవీణ్, కేడారి మేకల, రత్నం ప్రవీణ్, రేకల సైదులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్ర 5 గంటల వరకు ఓవరాల్‌గా 70.76%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 59.92, పాలేరు -77.11, మధిర -76.97, వైరా-75.22, సత్తుపల్లి-74.42, కొత్తగూడెం -62.37, అశ్వారావుపేట- 76.67
ఏజెన్సీలో నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు 4గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావం లేని ఖమ్మం సెగ్మెంట్లో 6గంటల వరకు పోలింగ్ సాగనుంది. క్యూలో ఉన్నవారు మాత్రం ఓటేయనున్నారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్‌గా 63.67%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 51.18, పాలేరు -67.95, మధిర -68.83, వైరా-67.79, సత్తుపల్లి-67.44, కొత్తగూడెం -60.92, అశ్వారావుపేట- 68.88
ఖమ్మంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని రాజేంద్రనగర్ జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్‌జెండర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఒకేసారి క్యూలైన్‌లో వచ్చి ఓటు వేశారు. తమను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ట్రాన్స్‌జెండర్లు సూచించారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఓవరాల్‌గా 50.63%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 41.67, పాలేరు -53.70, మధిర -55.38, వైరా-53.72, సత్తుపల్లి-53.87, కొత్తగూడెం -47.60, అశ్వారావుపేట- 53.63
హార్ట్ ఎటాక్‌తో ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. పేరాయిగూడెం బూత్ నెంబర్ 165లో ఓటింగ్ విధులకు అధికారి గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామ సమస్యలు పరిష్కరించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు. సాగు, తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు అవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.