Khammam

News April 22, 2024

ఎన్నికల ప్రక్రియను వేగవంతం‌చేయాలి: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సహాయ రిటర్నింగ్ అధికారులతో ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల పనులు నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈక్రమంలో అధికారులకు సూచనలు సలహాలు అందించారు.

News April 21, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటన అంటూ ఫేక్ ఫోటో వైరల్

image

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని ఏఐసీసీ అధిష్టానం ఖరారు చేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసిందంటూ కొందరు ఫేక్ ఫోటోను వైరల్ చేస్తున్నారు. కొందరు సొంతంగా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని, ఇంకా ఖమ్మం అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేయలేదని ఆ పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ అభ్యర్థి ప్రకటనపై తప్పుడు ప్రచారం చేయొద్దని పేర్కొన్నారు.

News April 21, 2024

మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర శుద్ధ అబద్ధం: వద్దిరాజు

image

బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనునాయక్‌ను కాంగ్రెస్ గూండాలు హత్య చేశారంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ప్రతినిత్యం భౌతికదాడులు జరుగుతున్నాయన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర జరిగిందనేది శుద్ధ అబద్ధమని చెప్పారు.

News April 21, 2024

కూసుమంచి మండలంలో పిడుగుపాటు

image

ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుసింది. కూసుమంచి మండలంలోతాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో భారీ శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో ప్రజలెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఉరుములు వచ్చే సమయంలో ప్రజలు చెట్లు, పొలాల వద్ద ఉండొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 21, 2024

KTDM: పురుగు మందు తాగి నవవధువు ఆత్మహత్య

image

పురుగు మందు తాగి నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన వెంకటాపురం మం. ముత్తారంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శశికళ (25)కి ఈనెల 4న చర్ల మండలం కత్తిగూడెంకి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఈ మధ్య పుట్టింటికి వచ్చిన శశికళను తల్లిదండ్రులు తిరిగి కాపురానికి వెళ్లమని చెప్పారు. ఇష్టం లేని శశికళ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 21, 2024

‘ఎర్లీబర్డ్ పథకం’కు పది రోజులు మాత్రమే గడువు

image

5 శాతం రాయితీతో ఎర్లీబర్డ్ పథకం కింద నగర, పురపాలికల్లో ఆస్తి పన్ను చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 10 రోజులు మాత్రమే గడువు ఉండటంతో సెలవు రోజుల్లో సైతం పన్నుల చెల్లింపునకు అధికారులకు అవకాశం కల్పించారు. ఈనెల 1 నుంచి ప్రారంభం కాగా శనివారం నాటికి ఆరు పురపాలికల్లో ఖమ్మం నగరపాలికలో రూ.6.30 కోట్లు వసూలు చేశారు. ప్రస్తుతం సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వసూళ్లలో జాప్యం జరుగుతోంది.

News April 21, 2024

ఖమ్మం: మే 26 వరకు ప్యాసింజర్ రైళ్ల రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ఈనెల 22 నుంచి మే 26వ తేదీ వరకు ఖమ్మం మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎం.డీ.జాఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం రోడ్డు – విజయవాడ, కాజీపేట-డోర్నకల్ జంక్షన్, డోర్నకల్-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించనున్నట్లు తెలిపారు.

News April 21, 2024

ఖమ్మం: ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి, స్వాతిల చిన్న కుమారుడైన కిరణ్ తోటి పిల్లలతో కలిసి స్థానిక చెరువులో ఈతకు వెళ్లి నీటిలో పడి మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

News April 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో KCR రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ CM కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, బస్సు యాత్రలు చేపట్టనున్నారు. BRS పార్టీ రోడ్‌షోలకు సంబంధించిన ప్రాథమిక రూట్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ నెల 29న ఖమ్మంలో కేసీఆర్ రోడ్ షో ఉండనుంది. 30న తల్లాడ, కొత్తగూడెంలో మాజీ సీఎం రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

News April 21, 2024

KMM: నిద్రపోతుండగా విద్యార్థినికి పాము కాటు

image

పాము కాటు గురై ఓ విద్యార్థిని తీవ్ర అవస్థతకు గురైన ఘటన తిరుమలాయపాలెం మండలంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్నాబాద్ గ్రామానికి చెందిన మాగి వెంకన్న, లక్ష్మి దంపతుల కుమార్తె స్పందన శనివారం రాత్రి ఇంట్లో పడుకొని ఉండగా పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్పందన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.