India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం పార్టీ నాయకులు అబ్దుల్ నబి అన్నారు. ఆదివారం సీపీఎం పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ సాయిబాబా సంతాప సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాపై అనేక అక్రమ కేసులను బనాయించి జైలులో నిర్బంధించారని అన్నారు. సాయిబాబా మరణం ప్రజాస్వామ్య వాదులకు తీరని లోటు అని అన్నారు.

గంజాయి కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ భూక్యసాగర్ నాయక్ హైదరాబాదులో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పోలీస్ అధికారుల పేర్లు చెబుతూ సూసైడ్ సెల్ఫీ వీడియో తీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు.

ఎర్రుపాలెం మండల కేంద్రంలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

భద్రాచలం పట్టణంలోని హోటల్ గీతాంజలి వీధిలో ఉన్న ఓ ఇంట్లో మహిళ దీపారాధన చేసింది. అనంతరం ఆరుబయట పనిచేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.

సీనియర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాతృమూర్తి కల్లోజి జయమ్మ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసి.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి దు:ఖంలో ఉన్న శ్రీనివాస్ కు ఎంపీ రవిచంద్ర ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల అన్నదాతలకు అదనపు ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు.

పండుగ వేళ కొత్తగూడెం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. కరకగూడెం మండలం మద్దెలగూడెం వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులలో ఒకరిని రేగళ్లకు చెందిన డోలు భద్రుగా గుర్తించారు. మరొకరిది చత్తీస్ గఢ్‌గా తెలుస్తోంది. పోలీసులు ఘటన జరిగిన తీరును ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

హీటర్ పెడుతుండగా కరెంట్ షాక్‌తో మహిళ మృతిచెందిన ఘటన కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. పినపాక మండలం అమరారం పంచాయతీలోని జిన్నలగూడెంలో బొజ్జ రజిత (26) నీళ్లు వేడి చేయడానికి హీటర్ పెడుతున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. ఈ.బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అశ్వారావుపేటలో శనివారం జరిగిన పామాయిల్ రైతుల అవగాహన సదస్సులో మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. పామాయిల్ సాగుకు అశ్వారావుపేట పుట్టినిల్లు అని, ఎన్టీఆర్ చేతుల మీదుగా జిల్లాలో తొలి పామాయిల్ మొక్క నాటామని అప్పటి ఘటనను గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో తనకు వచ్చిన అవకాశంతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామన్నారు. తెలంగాణలో పామాయిల్ సాగుకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎర్రుపాలెంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయబోతున్నామని పేర్కొన్నారు. మహిళలతో కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇందిరా మహిళా డెయిరీని చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.